Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన నిజజీవితంలో చాలామంది మహిళలకు మాతృత్వ మధురిమను అందుకోడానికి ఆరాటపడుతుంటారు. అందరూ తల్లి కావాలనే అనుకుంటారు. ఎవరో కొందరు వివిధ కారణాల వలన మాతృత్వమే వద్దను కుంటారు. కాని మాతృత్వం అందమైన వరం. అది మహిళలకు ప్రత్యేకం. ఒక జీవిని సృష్టించడం దానికి ప్రాణం పోయడం మహిళలకే సాధ్యం.
ఇందుకు మన శరీరంలో అండాశయాలలో తయారయిన అండం ఫాలోపియన్ ట్యూబులలో శుక్రకణంతో ఫలదీకరణము జరిగి, గర్భసంచిలోకి వచ్చి అక్కడే పిండం పెరుగుతుంది. ఈ అండం విడుదలకు, పిండం పెరిగేకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోనులు పిట్యూటరీ ద్వారా హైపోధాలమస్ ద్వారా ప్రోగ్రాం చేయబడతాయి.
ఒక నెలకు ఒక అండమే విడుదల. అది 16 -45 సంవత్సరాల వరకే. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నంత వరకు మాత్రమే చర్మం మెరుపు సంతరించుకుని నిగనిగలాడుతుంది. గుండె జబ్బులు, చాలా జబ్బుల నుండి ఈస్ట్రోజన్ రక్షిస్తుంది. ఎపుడయితే ఈ రక్షణపోతుందో అపుడే మెనోపాజ్ అనే మోడుదశ వస్తుంది. అలసట, నిద్రలేమి, రాత్రిల్లు చమటలు పట్టడం, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలడం, హాట్ ఫ్లష్‌లు, నెలసరి ఆగిపోవడం, చర్మం ముడతలు, ఎముకలు బోలు పోవడం వంటి చాలా రిస్కులు వస్తాయి.
చాలామందిలో గర్భసంచి ఆపరేషన్లలో అండాశయాలు కూడా తీసేస్తారు. కొందరు తెలివైన డాక్టరులు ఒక అండమైనా ఉంచుతారు. అది మెనోపాజ్ లక్షణాలు రాకుండా ఆపుతుంది. మనం టార్గెట్ ఆర్గాన్లు తీయగానే పిట్యూటరీ హైపోధాలమస్ ఆక్సెస్ పోయి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఆగిపోయి ఈ హార్మోనులు లెవల్ దారుణంగా పడిపోయి తొందరగా మెనోపాజ్ లాంటి స్ధితి వస్తుంది.
గర్భసంచి తీసివేసే ప్రధాన కారణాలలో గర్భాశయ, సర్విక్సుకాన్సర్ ముఖ్య కారణాలు. తప్పదు, అది లేక గత్యంతరంలేదు.. ఎర్రమైల లేదా రెడ్ డైపర్ అనేది కామన్ మెనోపాజల్ ఎక్కువగా వస్తుంది.
తెల్లమైల లేదా వైట్ డైపర్ అనేది వయసులో ఉండేవారిలో సాధారణంగా గర్భసంచి తీసేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎక్కువగా గర్భసంచి నుంచి వచ్చే సెక్రెషన్సు ఒక కారణమైతే, ఫంగస్, బాక్టిరియా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్లు ఓ కారణం,.
ఒక యవ్వనమహిళలలో తెల్లమైల ఉంటే వైద్యులకు చూపించి మందులు వాడచ్చు. కొందరికి పాత కాలంలో సర్వైకల్ కాటరైజేషన్ లాంటి పద్ధతులుండేవి. ఇంకా ఫయిబ్రాయిడ్సు అనే గడ్డలు, ప్రొలాప్సు (లిగమెంటు జారడం వలన వెజైనాలోకి జారిపోతుంది), అడినోమయోసిస్, ఎండో మెట్రియోసిస్, ఎక్కువగా బ్లీడింగ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీసెస్ ముఖ్యకారణాలు.
ఇపుడంతా ఫాస్టు యుగం. పేషెంట్లు ఓపికగా వైద్యం చేయించుకోరు. వైద్యులకు ఓపికలేదు. పైన చాలా జబ్బులు ఓ పట్టాన నిర్ధారించలేరు. నిర్ధారించినా అది తొందరగా తెమలవు. మందులు వాడుతూ ఉండాలి. హైజీను ముఖ్యం. కొన్నిటిని డయాగ్నోసిస్ చేయలేక ూ×ణగా బ్రాండేస్తారు. ఇక అంతే.
మన తెలుగు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలోని గ్రామాలలో 75శాతం మహిళలకు గర్భసంచులే తీసేసారు. అందుకే ఒక సమయంలో ఆరోగ్యశ్రీ నుంచి ఆ ఆపరేషనే తీసేసారు. ఇందులో వైద్యులు, పేషెంట్లు, తప్పుడు సమాచారం, అపోహ, అవగాహనలేమి ప్రధానకారణాలు.
బ్లీడింగయినా, వైట్ డిశ్చార్జ్ అయినా మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. అది సహజం.. పిల్లలు కనడం ట్యూబెక్టమి పల్లెలలో 22-25 ఏండ్లకే అయిపోతుంది. వీళ్ళ సెక్సువల్ లైఫ్‌కు ఇవి ఆటంకం. భర్త పరాయి మహిళలకు అలవాటు పడతాడని ఓ భయం. అంతేగాక చాలాసార్లు వైద్యులను కలవడం కష్ఠం. ఇలాంటి సమస్యలు ఓపట్టాన తెమలవు. ఆత్మన్యూనత, సూటిపోటి మాటలు బెంబేలెత్తిస్తాయి. చెప్పుకోవడమే కష్ఠం. మరలా మరలా అంటే మానసికంగా నలిగిపోతారు. ఎందుకొచ్చిన బాధ ఆ గర్భసంచి తీయించుకుంటే అంతా అయిపోతుంది అనే ఎమోషనల్ నిర్ణయానికి వచ్చి తీసేయించుకోవడానికి సిద్ధమవతారు. వైద్యులు సమాధానాలు చెప్పలేక తీసేస్తే ఓ పని అయిపోతుంది, మీకు మాకు లాభం అంటారు. ఒకటి రెండు సార్లు వైద్యులు చెప్పినా మహిళలు డిసైడైతే వార్ వన్ సైడే.
మాతృత్వం మధురిమల నందించిన గర్భాశయమే తనది కానిదైపోతుంది. లాంగ్ టర్ముప్రాబ్లమ్స్ తెలియవు. తెలిసినా చెవికెక్కవు. ఎక్కినా సమాజిక అంశాలు, ప్రస్తుత సమస్యలే ప్రధానమవతాయి. ఇక తెగించి గర్భసంచి తీపించుకునేందుకు సన్నద్ధమవతారు.
గర్భసంచి అండాశయాలు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ముఖ్య అవయవాలు. వాటిని తొందరపడి తొలగించుకోకండి. ఒకటికి పది సార్లు ఆలోచించమని ఆడపడుచులకు సలహా. మగవాళ్ళు కూడా వారిని ఆ బాధలను ఎదుర్కొనేలా సహకారం అందించాల.. విసుక్కోని తీపించుకో అనరాదు. అత్యవసరమైనా, కాన్సరైనా, వైద్యులు కంపల్సరీ అంటేనే చేపించాలి.
మహిళలూ గుర్తుంచుకోండి.. తొందరపడి గర్భసంచి తీయించుకోకండి. అది ఉన్నంత వరకే మీరు ఆరోగ్యంగా ఉండగలరు
- డా|| సి. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
ర్నూలు, ఆంధ్రప్రదేశ్.