Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ నెలలో ముస్లింలు ఇఫ్తార్ సమయంలో స్నాక్స్, అపెటైజర్స్, బేవరేజస్, డిసెర్ట్స్ పూర్తి వైవిధ్యంగా, అద్భుతమైన రుచులతో ఉంటాయి. ఇఫ్తార్ విందును కుటుంబ సభ్యులు, మసీదులు, ఇతర ప్రాంగణాలలో కమ్యూనిటీతో కలిసి జరుపుకుంటారు. ఈ రంజాన్ వేళ ఇఫ్తార్ విందు సమయంలో ఆస్వాదించదగిన కొన్ని రంజాన్ ఫుడ్స్‌ను గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు.
హలీం: ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నెమ్మదిగా ఉడికించి తయారుచేస్తారు. అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది.
కెబాబ్స్: కెబాబ్స్‌ను తినడాన్ని ఇష్టపడనివారెవురుంటారు. మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా చేస్తారు.
చికెన్ షావార్మా: అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి తీసుకోవడం చేస్తారు. అత్యంత రుచికరంగా మాత్రమే కాదు ఇదే ఓ మీల్లా సరిపోతుంది.
కీమా సమోసా: ఇఫ్తార్ వేడుకలు ఇది లేకుండా పూర్తి కాదు. గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి.
మటన్ రెసాలా: మటన్రెసాలా అనేది అథెంటిక్ బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్‌లను పెరుగులో నానబెట్టి, జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
దమ్ బిర్యానీ: దక్షిణ భారతదేశంలోనే దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలను నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది.
షీర్ ఖుర్మా: రంజాన్ సమయంలో విరివిగా కనిపించే మొఘలారు తియ్యదనం షీర్ ఖుర్మా. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. ఈ షీర్ఖుర్మా ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో కనిపించే మొదటి డిసెర్ట్ ఇది.
గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ''రంజాన్ మాసంలో గొప్పతనమేమిటంటే దాని పవిత్రతతో అది కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చుతుంది. ఇది నిజంగా జష్న్-ఏ-రంజాన్. ఇది అందరినీ ఏకం చేయడంతో పాటుగా పవిత్ర మాసాన్ని మరింత అర్ధవంతంగా మలుస్తుంది'' అని అన్నారు.
ఇంకా ఈ రుచుల ఆస్వాదన చేయలేదా... ఈ నెల ముగిసేలోపుగానే ఆ ఆస్వాదన చేయండి!