Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఏదైతేనే మానసికంగా కుంగదీయడానికి. రాత్రిల్లు బెడ్ మీద పడుకున్నా తొందరగా నిద్ర పట్టదు. ఉదయాన్నే కండ్ల కింద నల్లగా అవుతుంది. బిజీలైఫ్ కారణంగా ఒత్తిడి అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు, కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం..
- చాలామంది రాత్రి పూట వ్యాయామం చేస్తే అలసిపోయి బాగా నిద్రపడుతుందని అనుకుంటారు. అయితే వాస్తవానికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలోని నరాలన్నీ ఉత్తేజం అవుతాయి. అప్పుడు నిద్ర కోసం చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది.
- కెఫెన్ ఉండే పదార్థాలకు రాత్రిపూట సాధ్యమైనంత దూరంగా ఉండండి. చాలా మంది కాఫీలకు చాలా అలవాటు పడి ఉంటారు. అది మోతాదుకు మించితే నిద్రకు ప్రమాదమే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మీ ప్రశాంతమైన నిద్రకు కూడా ప్రమాదకరం.
- అతిగా కొవ్వు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అవి సరిగ్గా జీర్ణం అవ్వక మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. కొవ్వులు లేని ఆహారం పదార్థాలు గానీ, మంచి విటమిన్లతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికే కాదు మీ నిద్రకు కూడా చాలా మంచిది.
- మొబైల్ మీద ఉండే బ్లూ లైట్ కళ్లకు చాలా హాని చేస్తోంది. ముఖ్యంగా చీకట్లో దీన్ని వినియోగించడం వల్ల కండ్లపై ఎఫెక్ట్ చూపించి నిద్రను దూరం చేస్తోంది. కాబట్టి రాత్రి పూట మొబైల్ చూడకపోవడం చాలా మంచిది.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో కాస్త తేనె కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.
- అల్లం, తులసి, కుంకుమపువ్వు పదార్థాలతో టీ తయారు చేయండి. అందులో తగినంత తేనె కలిసి ఆ టీని రోజుకు ఒకసారి తాగండి. ఈ టీలోని ప్రతి పదార్థం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా రోజూ ఒక్కసారి టీ తాగడం వల్ల నిద్రలేమి వల్ల ఏర్పడిన డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.