Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరుగుతున్న వయసుతో పాటు మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు. అవి ఏమిటి అన్న విషయాలు చూద్దాం.
మహిళలు, యుక్త వయసులో ఉన్న బాలికలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు మొదలు అవుతాయి. అందులో ముఖ్యంగా నెలసరి సమస్యలు, ప్రెగెన్సీ వంటివి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు పెరుగు తున్న కొద్దీ బాల్యం, కౌమారం దసలు దాటి యవ్వనంలోకి అడుగు పెట్టగానే శరీరంలో వివిధ మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే మనం ఎదుర్కునే సమస్యల నుండి పోరాడేందుకు ఆహార వ్యవహారాలు, జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు. మహిళల శరీరతత్వం ఒకే రకంగా ఉండదు. వేరు వేరుగా ఉంటుంది. ఎదో ఒకరకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు డాక్టరుని సంప్రదించడం అవసరం. అయితే కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తునారు.
నెలసరి సమస్యలపై: సరైన సమయంలో సుఖవంత మైన పీరియడ్స్ వస్తేనే ఆరోగ్యసంబంధమైన చాలా సమస్యలకు దూరం చేస్తాయి. దీనిని గమనించడం అత్యవసరం. మీనేలసరి చక్రం ఎన్నిరోజులకు వస్తోంది. ఒక్కసారిగా ఏమైనా మార్పులు వచ్చాయా? ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. అప్రమత్తం ఉండాలి. ఏదైనా మార్పు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ను సంప్రదించండి.
కుటుంబ నియంత్రణ: 30 సంవత్సరాలు వచ్చే నాటికీ మహిళలకు శక్తి తగ్గిపోతుంది. 40 సంవత్సరాలు దాటగానే పూర్తిగా బలహీన పడతారు. ఈ మధ్య కాలంలో ప్రసవం విజయవంత అయినప్పటికీ అది సరైన సమయం కాదు. గర్భిణీలుగా ఉన్నప్పుడు శరీర పరిస్థితిని చూసి అర్ధం చేసుకుంటారు. కాబట్టి సరైన సమయంలోనే ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.
యోని సంబంధిత ఇంఫెక్షన్లపై: యోని సంబంధిత ఇన్ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలి. ఇది మీకు తెలుసా చాలా రకాల ఇంఫెక్షన్ల లక్షణాలు చాలా తక్కువే. క్లేమా డా డియా, గనేరియా లాంటి ఇన్ఫెక్షన్లు స్పష్టంగా కనబడక పోవచ్చు. మూత్ర విసర్జనతో పాటు నొప్పి, వేజైనల్ డిస్చార్జ్, నెలసరిలో అధిక ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. వివాహిత కానట్లయితే గర్భ నిరోధక మాత్రలు లేదా ఇతర సాధనాలు వాడినా పరీక్షలు చేయించడం .ఇదీ కాక హెచ్ బి వి సంబంధిత ఇన్ఫెక్షన్లు సర్వైకల్ రోగాలకు సంబంధించిన సమస్యలు ఉండి ఉండవచ్చు. ప్రతి ఏటా పాప్సి మియర్ చేయించడం మర్చిపోకండి. తద్వారా అనారోగ్య సమస్య నుండి బయట పడండి.