Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం కోల్డ్ కాఫీ, శీతల పానీయాలు సిప్ చేస్తారు. ఈ పానీయాలు తాగేటప్పుడు ప్లాస్టిక్‌తో చేసిన సన్నని స్ట్రాను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని ఉపయోగిస్తే శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
- స్ట్రాతో డ్రింక్ తాగినప్పుడు దంతాలు, నోటికి మధ్య పేరుకుపోయిన క్రిములు శరీరంలోకి కొట్టుకుపోతాయి. ఇది వివిధ రకాల నోటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
- స్ట్రాను రోజూ ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే దీంతో తాగితే కడుపులోని గాలి పోతుంది. ఫలితంగా గ్యాస్ సమస్య కూడా పెరుగుతుంది.
- స్ట్రాను తయారు చేసిన ప్లాస్టిక్ చాలా తక్కువ నాణ్యతతో ఉంటుంది. చల్లని లేదా వేడి పానీయం వెళుతున్నప్పుడు ప్లాస్టిక్ అదనపు కణాలు దానితో కలుపుతాయి. ఇది శరీరంలోకి వెళ్లి వివిధ రకాల నష్టాన్ని కలిగిస్తుంది.