Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డయాబెటీస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే ఆహారాన్ని తీసుకుంటారు. కానీ దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో బీపీతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా సమంగా ఉంటాయట. ఆరోగ్యంగా ఉండటానికి డైట్, ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు కచ్చితంగా కొన్ని ఫుడ్ డైట్స్ పాటించాలి. దీంతో వారి బ్లడ్‌లో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ సమతూల్య ఆహారంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే.. ఇక ఆరోగ్యంపై నిశ్చింతగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
తీసుకోవల్సిన ఆహార పదార్థాలు
- డయాబెటీస్‌తో బాధపడేవారు కేవలం కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బ్రొకోలి, క్యారట్, గ్రీన్స్, పెప్పర్స్, టమాట.
- ఆరెంజ్ ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వాటర్‌మిలన్, మస్కమిలన్, బెర్రిస్, యాపిల్స్, బొప్పాయి వంటివి తినవచ్చు.
- పప్పుధాన్యాలు ముఖ్యంగా గోధుమలు, రైస్, ఓట్స్, కార్న్‌మీల్, బార్లీ, క్వినోవా వంటి ఫుడ్ తీసుకోవాలి.
- చికెన్, ఫిష్, లీన్ మీట్, నట్స్, పీనట్స్, ఎగ్స్, బీన్స్, డ్రైడ్ బీన్స్.. చిక్పీస్, తోఫూ వంటివి కూడా తీసుకోవాలి.
- నాన్‌ఫ్యాట్ డైరీ పదార్థాలైన ఓట్ మిల్క్, అల్మాండ్ మిల్క్, యోగార్ట్, లో ఫ్యాట్ మిల్క్, ఛీజ్ వంటివి తీసుకోవాలి.
తీసుకోకూడనివి
- డయాబెటీస్‌తో బాధపడేవారు ఫ్రైడ్ ఫుడ్స్‌తోపాటు, ట్రాన్స్‌ఫ్యాట్, ఉప్పు, పచ్చళ్లు, పాపడ్, క్యాండీస్, బేక్డ్ గూడీస్, ఐస్‌క్రీం తీసుకోకూడదు. ఎక్కువ మోతాదులో చక్కెర ఉండే పానియాలను కూడా దూరం పెట్టాలి.
ఎక్సర్సైజ్
- డయాబెటీస్ రోగులు ఎక్సర్సైజ్ చేయడం ఎంతో ముఖ్యం. దీంతో డిప్రెషన్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు రోజులో కనీసం 30 నిమిషాలు నడవాలి. కొన్ని యోగా ఎక్సర్సైజ్లు కూడా చేయాలి.
నీటిని తగిన మోతాదులో తాగాలి.
- ఫిజికల్ యాక్టివిటీస్‌తో బీపీ కంట్రోల్లో ఉంటుంది. కానీ లాంగ్ వర్కౌట్స్ చేయకూడదు. దీనివల్ల హైపోగ్లైసెమియా వచ్చే ప్రమాదం ఉంది.
వాగింక్ చేసే సమయంలో సరైన షూస్ ధరించాలి.