Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదేనేమో. చిన్న ఆలోచన ఆమెను వ్యాపారవేత్తగా మార్చేసింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా మారిన సోనియా షా 2019లో ముంబైలో ఇల్లు, వంటగది శుభ్రం చేసుకునే ఉత్పత్తులతో రాసో క్లీనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ప్రారంభించారు. బిగ్‌బాస్కెట్, బ్లింకిట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అవి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 35,000 బాటిళ్లను విక్రయించిన ఆమె విజయం వెనక దాగివున్న విశేషాలు నేటి మానవిలో...
సోనియా షా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నప్పుడే తన వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. డబుల్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఈమె న్యూయార్క్‌కు సంబంధించిన సిటీ గ్రూప్ క్యాపిటల్ మార్కెట్స్, ఆనంద్ రాఠి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోసం పనిచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తన కుటుంబం చేసే టీ వ్యాపారానికి కొంత సమయం కేటాయిస్తున్న సమయంలోనే వ్యాపారంపై తనకున్న ఆసక్తిని గమనించారు.
మనసు చెప్పిందే వింటాను
2015లో తిరిగి ముంబైకి వెళ్లి గృహాలంకరణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. వాటిని భారతీయ టోకు వ్యాపారులకు విక్రయించారు. అయితే ఈ వ్యాపారంలోకి ప్రవేశించిన నాలుగు సంవత్సరాల తర్వాత తన సోదరితో మాట్లాడిన ఒక చిన్న కాల్ ఆమె మార్గాన్ని మార్చింది. ''నేను వర్క్హోలిక్ని, నా మనసు చెప్పిందే నేను వింటాను'' అని ఆమె చెప్పారు. మార్కెట్లో సమర్థవంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్ లేకపోవడం గురించి వారు చర్చిస్తున్నప్పుడు ఆమె సోదరి వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఇంటిని శుభ్రపరిచే ద్రావణాన్ని ఇంటిని శుభ్ర పరిచేందుకు ఉపయోగిస్తున్నానని పంచుకుంది.
రాసో క్లీనింగ్ ఉత్పత్తులు
''నేను దానిని ప్రయత్నించాను. అది అద్భుతాలు చేసింది. యూటూబ్‌లో దాని గురించి మరింత శోధించాను. ఎన్నో వీడియోలు చూశాను. కానీ అలాంటి ఉత్పత్తులు ఏవీ నాకు మార్కెట్లో దొరకలేదు'' అని సోనియా చెప్పారు. R&Dలో దాదాపు ఒక సంవత్సరం పని చేసిన తర్వాత 2019లో సోనియా వెనిగర్, బేకింగ్ సోడాతో నడిచే క్లీనింగ్ ఉత్పత్తులను రూపొందించడానికి రాసో క్లీనింగ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. రాసోకు రెండు బ్రాండ్లు ఉన్నాయి. సోవి(ఫ్లోర్ క్లీనర్), టైడ్ బౌల్ (టాయిలెట్ క్లీనర్).
మహమ్మారి సవాలుగా మారింది
''మురికి నుండి వెన్నలా బయటకు వచ్చింది'', సోనియా తన సోదరి చెప్పిన ఇంటిని శుభ్రపరిచే పరిష్కారాన్ని మొదటిసారి ప్రయత్నించినట్టు చెప్పింది. ''నా ఆలోచన ప్రారంభ దశలో ఉంది. దీన్ని విజయవంతమైన ఉత్పత్తిని చేయడానికి బలమైన R&D అవసరం'' అంటున్నారు ఆమె. సంవత్సరం పాటు R&Dలో తనకు సహాయం చేసిన మాజీ ex-BASFశాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రన్‌ను కలుసుకున్నారు. ఏప్రిల్ 2020 నాటికి ఆమె భారతదేశంలోని మొట్టమొదటి వెనిగర్, బేకింగ్ సోడాతో నడిచే క్లీనింగ్ ఉత్పత్తుల 3,000 బాటిళ్లను సిద్ధం చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారితో రాసోకు దాని ఉత్పత్తిని మార్కెట్ చేయడం, విక్రయించడం సవాలుగా మారింది.
బిగ్‌బాస్కెట్ తిరస్కరించింది
'ఏప్రిల్‌కి ముందు మేము దీన్ని పైలట్‌గా ప్రారంభించాము. మా స్నేహితులు, బంధువులు ఉత్పత్తిని ఇష్టపడ్డారు. ఇంతలో నేను బిగ్‌బాస్కెట్‌తో టచ్‌లో ఉన్నాను. కానీ అన్ని లిస్టింగ్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత దేశం లాక్డౌన్లోకి వెళ్లింది'' అని సోనియా చెప్పారు. ప్రారంభంలో బిగ్‌బాస్కెట్ రాసో ఇన్వెంటరీని జాబితా చేయడాన్ని తిరస్కరించింది. మార్కెట్ అనిశ్చితికి భయపడి అనవసరంగా కొత్త వ్యాపార ఇన్వెంటరీని బ్లాక్ చేసింది. అయితే మార్కెట్ స్థిరంగా మారిన తర్వాత అది సోవి ని 'ఎసెన్షియల్' విభాగంలో జాబితా చేసింది. ఇది బ్రాండ్‌కు అద్భుతాలు చేసింది.
ఇప్పుడు అత్యంత ర్యాంకులో
''3,000 సీసాలు నిల్వ చేశాము. ఇది మాకు బలమైన ప్రేరణనిచ్చింది. ఫ్లోర్ క్లీనర్లను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత మేము డిష్‌వాషింగ్ లిక్విడ్, గ్లాస్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లను ప్రారంభించాము. అన్నీ బిగ్‌బాస్కెట్‌లో అత్యంత ర్యాంక్‌లో ఉన్నాయి'' అని సోనియా నొక్కి చెప్పారు. రాసో ఉత్పత్తులు లీటరు బాటిల్‌కు రూ. 219 నుండి 299 మధ్య ధర పలుకుతుంది. బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, అమెజాన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి ముంబై, సిలిగురిలోని కొన్ని సాధారణ దుకాణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంకా తగిన సామర్థ్యాలు లేవు
అక్టోబర్ 2021 నాటికి రెండు బ్రాండ్లు 25,000 యూనిట్లను విక్రయించాయని, మార్చి 2022 నాటికి రాసో 35,000 బాటిళ్లను విక్రయించినట్టు సోనియా చెప్పారు. 21-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం స్థూల సరుకుల విలువ (GMV) రూ. 4.5 మిలియన్లకు పైగా సాధించింది. మార్చి 2023 నాటికి నెలకు రూ.20 లక్షల ఆదాయ రన్ రేట్‌ను సాధించాలనుకుంటోంది. రాసో వృద్ధి పథంలో ఉన్నప్పటికీ తనకు వరుసగా డొమెక్స్, హార్పిక్ హోమ్ క్లీనింగ్ బ్రాండ్లను కలిగి ఉన్న రెకిట్ బెంకీజర్, హెచ్‌యుఎల్ వంటి =డణ సామర్థ్యాలు లేవని సోనియా చెప్పారు.
ఇండియా అతిపెద్ద మార్కెట్
2020లో 28.5 బిలియన్ల డిమాండ్‌తో గృహ శుభ్రపరచడం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కోసం భారతదేశం మూడవ అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది.Lizol, Dettol, Colin, Harpic, Vim, Cif, Domex మొదలైన వంటి వాటితో సహా బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సోనియా కంపెనీని రూ. 12 లక్షలతో బూట్‌స్ట్రాప్ చేశారు. అక్కడ ఆమె పెట్టుబడిలో 50 శాతం ఆర్ అండ్ డి, ఫార్ములేషన్ డెవలప్మెంట్, క్వాలిటీ టెస్టింగ్ కోసం ఉపయోగించింది. ఆమె మూలధనంలో మూడవ వంతును బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించారు. మిగిలిన నిధులను ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ మెటీరియల్‌లు, లాజిస్టిక్స్ మద్దతు కోసం ఉపయోగించారు.
శ్రద్ధ చూపడం లేదు
రాసో అన్ని ఉత్పత్తులను ముంబై యూనిట్లో తయారు చేస్తారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా తనిఖీలను నిర్వహిస్తుంది. ''ఇంటి శుభ్రపరిచే ఉత్పత్తులపై చాలామంది పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. టీవీ ప్రకటనల్లో చూసిన వాటిని కొనుగోలు చేస్తారు. ఉత్పత్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే అసలు సవాలు. మేము మాస్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాము. మా ధర కూడా తక్కవగా ఉంటుంది. అయితే స్థాపించబడిన మాస్ బ్రాండ్ల కంటే 10 నుండి 15 శాతం ఖరీదైనది. ఇప్పటి వరకు నోటి మాటతోనే ఎదిగాం. హౌస్ హెల్ప్ మా ఉత్పత్తిని యజమానికి సిఫార్సు చేసిన ఫీడ్‌బ్యాక్ నాకు అందింది. అదే మమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది'' అని సోనియా జతచేస్తుంది.
భవిష్యత్ అవకాశాలు
త్వరలోనే రాసో కొత్త లాండ్రీ లిక్విడ్ డిటర్జెంట్‌తో బయటకు రావడానికి ప్లాన్ చేస్తోంది. సోనియా ఈ ఏడాది రాసోను మరింత విస్తరింపజేసే పనిలో ఉన్నారు. బ్రాండ్ తన భౌతిక రిటైల్ ఉనికిని బలోపేతం చేయడానికి Foodhall, Haikoతో చర్చలు జరుపుతోంది. సోనియా కూడా వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నారు. ''ఈ మహమ్మారి ఆన్లైన్లో ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయమని మనల్ని ప్రేరేపించింది. అయితే ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తుల కోసం 80 శాతం మార్కెట్ సాధారణ వాణిజ్యం ద్వారానే ఉంది. మేము ప్రతిచోటా ఉండాలనుకుంటున్నాము'' అని సోనియా చెప్పారు. సోనియా కూడా బిజినెస్-టు-బిజినెస్ (B2B) రంగంలోకి ప్రవేశించడానికి కృషి చేస్తున్నారు. అయితే తీవ్రమైన ధరల పోటీ ఆమెకు అడ్డంకిగా ఉంది.
- సలీమ