Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాలూ కిరార్... రియాలిటీ షో, ఇండియాస్ గాట్ టాలెంట్‌తో ఖ్యాతి గడించిన జాతీయ స్థాయి జిమ్నాస్ట్. రౌనక్ గులియా... జాతీయ స్థాయి రెజ్లర్, ఒలింపిక్ పతకాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇద్దరూ తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, కెరీర్‌ని ముందుకు కొనసాగించేందుకు, ఆర్థికంగా స్థిరపడేందుకు లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. దానికోసం కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫాం టికిని ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకుందాం...
జిమ్నాస్ట్ షాలు కిరార్... పదేండ్ల వయసులో పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడకు పరిచయమయింది. తండ్రి మద్దతుతో దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ ప్రక్రియలో అనేక పతకాలను గెలుచుకుంది. ఇటీవల ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 9లో రన్నరప్‌గా నిలిచిన బాంబ్ ఫైర్ గ్రూప్‌లో భాగమైంది. రౌనక్ గులియా... ఒక ప్రొఫెషనల్ రెజ్లర్. మూడు సార్లు జాతీయ పతక విజేత, ఆరుసార్లు స్టేట్ ఛాంపియన్ టైటిల్ విజేత, రెండు సార్లు భరత్ కేసరి విజేత. ఆమె ఇండియాస్ అల్టిమేట్ వారియర్ అనే రియాలిటీ షోలో పాల్గొంది. అక్కడ గాయం కావడంతో క్రాష్ అయ్యింది.
అవాంతరాలను ఎదుర్కొని
ఇద్దరికీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ టికిలో మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. మీరు మీ అభిరుచి ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో ప్రపంచానికి చూపుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే షాలు, రౌనక్ ఇద్దరూ చిన్న పట్టణాలకు చెందినవారే. షాలు హర్యానాలోని రోV్ాతక్లో పుట్టిపెరిగింది. రౌనక్ గురుగ్రామ్ సమీపంలోని జురోలా అనే చిన్న గ్రామంలో పెరిగింది. ఇద్దరూ ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి వచ్చింది. విభిన్న మూస పద్ధతులను ఛేదించవలసి వచ్చింది.
సదుపాయాలు లేక
''నా చుట్టుపక్కల వారు, బంధువులు నన్ను చిన్నచూపు చూశారు. కానీ నా కుటుంబం జిమ్నాస్టిక్స్‌లో కొనసాగడానికి నన్ను ప్రేరేపించింది. హర్యానాలో ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చిన తర్వాత విద్యను కొనసాగించే అవకాశం లేదు. అమ్మాయిలను భారంగా భావించి 18 సంవత్సరాల వయసులోపు వివాహం చేసేస్తుంటారు. కానీ నా కుటుంబం ఇందుకు భిన్నంగా ఉంది'' అని షాలు చెబుతుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినప్పటికీ క్రీడలకు తగిన శిక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో షాలు అంతర్జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్స్ను ప్రదర్శించలేకపోయింది.
పెండ్లి తర్వాతనే...
ఆమెకు ఓ మంచి అవకాశం దొరికింది. అదే ఇండియాస్ గాట్ టాలెంట్ - సీజన్ 9 జరగడం. అందులో బాంబ్ ఫైర్ టీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ''బాంబ్ ఫైర్ టాప్ సెవెన్‌లోకి వచ్చినప్పటి నుండి మేము వివిధ నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి బాగా బిజీ అయిపోయాము'' అని షాలు చెప్పింది. పెండ్లి తర్వాత తనకు మంచి కుటుంబం దొరికిందని రౌనక్ చెప్పింది. పెరుగుతున్న వయసులో మద్యానికి బానిసైన తన తండ్రికి, గృహ హింసను ఎదుర్కొంటున్న తన తల్లికి ఆమె సాక్షి. రౌనక్ 12 సంవత్సరాల వయసులో ఆమె తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. అప్పటి నుండి ఆమె తన మేనమామ దగ్గర పెరిగింది.
కుటుంబం మద్దతుతో...
''నేను అంకిత్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నప్పుడు పన్నెండో తరగతి పూర్తి చేసాను. తర్వాత కూడా చదువు కొనసాగించడానికి కుటుంబం నాకు చాలా మద్దతు ఇచ్చింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ కోసం ఢిల్లీ యూనివర్సిటీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో చేరాను'' అని రౌనక్ చెప్పారు. కళాశాలలో ఉన్నప్పుడు ఆమె క్రీడల వైపు ప్రోత్సహించబడింది. అథ్లెటిక్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. ఆమె బిల్డ్, బలాన్ని చూసి టీచర్ ఆమెను రెజ్లింగ్‌లో ప్రయత్నించమని అడిగారు. కాలేజీలో అప్పుడు మహిళా రెజ్లింగ్ టీమ్ లేదు. కళాశాల సమీపంలోని అఖాడాను సందర్శించడం ప్రారంభించింది. 15-20 రోజుల తర్వాత ఇంటర్-కాలేజ్ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ ఆమె రెండు పోరాటాల్లో గెలిచింది.
పొట్టి బట్టలు వేసుకుంటానని
''నా కుటుంబం చాలా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా డాక్టర్ అయిన మా అత్తగారు నన్ను రెజ్లింగ్, చదువు రెండింటినీ కొనసాగించమని ప్రోత్సహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాను. వెళ్ళే దారిలో నేను ఫిట్నెస్తో ప్రేమలో పడ్డాను'' అని రౌనక్ చెప్పారు. మొదట్లో వివిధ వర్గాల నుంచి ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి. ''బాహు పొట్టి బట్టలు వేసుకుని పురుషులతో కుస్తీ పట్టడానికి ఎలా అనుమతిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ నా కుటుంబం వారి మాటలను పట్టించుకోలేదునన్ను'' ఆమె జతచేస్తుంది. అయితే శరీర గాయాలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి.
సోషల్ మీడియాలో...
టికి ద్వారా పాపులారిటీ సంపాదించడం కోసం ఆమె తనను రెండేళ్ల కిందట కలిసిన నరేందర్ భయ్యా ద్వారా పరిచయం అయ్యింది. తన ఎంట్రీపై మాట్లాడుతూ ''నేను టికి కంటే ముందు టిక్‌టాక్ వంటి అనేక ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డబ్లింగ్ చేశాను. నేను మేకింగ్ వీడియోలను ఇష్టపడుతున్నాను. అవి బాగా వైరల్ అవుతున్నాయని తెలుసుకున్నాను. ఇది హర్యాన్వీ సంప్రదాయ దుస్తులను ధరించి నేను చేసే విన్యాసాలతో సహా వివిధ రకాల జిమ్నాస్టిక్లను ప్రయత్నించమని నన్ను ప్రోత్సహించింది. అవి పెద్ద హిట్ అయ్యాయి'' అని చెబుతుంది.
రోజుకు మూడు వీడియోలు
షాలు వీడియోలు వ్యక్తిగత, సమూహ జిమ్నాస్టిక్స్, విన్యాసాల మిశ్రమం. ఆమెకు 1.56 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలకు 25.6 మిలియన్ల లైక్‌లు ఉన్నాయి. ''నేను బయటకు వెళ్లినప్పుడు ప్రజలు నన్ను గుర్తిస్తారు. ఇప్పటి వరకు 956 వీడియోలను చిత్రీకరించాను. ఒక రోజులో మూడు వీడియోలను పోస్ట్ చేస్తాను'' అని ఆమె జతచేస్తుంది. పేరు, పాపులారిటీతో పాటు షాలు ఒక నెలలో టికి నుండి 500 డాలర్లతో పాటు బోనస్‌ను కూడా సంపాదిస్తానని చెప్పింది. తన ప్రయత్నం కొనసాగడానికి ఇది ఒక ఉత్తేజకరమైన సమయం. పోషకాహారం, ఫిట్నెస్ పట్ల రౌనక్కి ఉన్న అవగాహన ఆమె టికి హ్యాండిల్లో కనిపిస్తుంది.
అనుభవాలు పంచుకునేందుకు
''నేను రెజ్లింగ్ ప్రారంభించినప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాను. ఇతర మహిళలను చేరుకోవడానికి, నా సొంత అనుభవాలను వారితో పంచుకునేందుకు నేను టికిలో చేరాను. పెండ్లయిన తర్వాత కూడా కలలు కనడం కొనసాగించవచ్చని వారికి చూపించాలనుకున్నాను'' అని ఆమె చెప్పింది. రౌనక్ పోషకాహారం, ఫిట్‌నెస్‌పై వీడియోలను పోస్ట్ చేస్తుంది. టికిలో ఆమెకు 187 వేల మంది అనుచరులు ఉన్నారు. అలాగే 2.67 మిలియన్ల లైక్‌లను కలిగి ఉంది. ''ప్లాట్‌ఫారమ్‌లో నాకు లభించిన మద్దతుతో నేను చాలా బిజీ అయిపోయాను. గాయం తర్వాత నేను త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు'' అని ఆమె జతచేస్తుంది.
భవిష్యత్తు విషయానికొస్తే
షాలు ప్రభుత్వ సంస్థలో జిమ్నాస్ట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని, ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడంలో సహాయం చేయాలనుకుంటుంది. ''ఏసీఎల్ గాయం నుండి కోలుకోవచ్చని నేను నిరూపించాలనుకుంటున్నాను. నా అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడమే'' అని రౌనక్ అంటుంది.