Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉడకబెట్టిన శనగలు, నానబెట్టిన శనగలు చాలా మందికి ఆహారంలో ముఖ్యమైన భాగం. ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న శనగలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగం. అయితే నల్ల శనగ జుట్టుపై కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
- తెల్లజుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తోంది. అయితే తెల్ల జుట్టు నివారణలో నల్ల శనగ బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, మాంగనీస్ జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. జుట్టు రాలే సమస్య వల్ల ఇబ్బంది పడుతుంటే బ్లాక్ గ్రామ్ హెయిర్ మాస్క్ మీకు చాలా ఉపయోగకరం. దీనితో పాటుగా శరీరంలో జింక్, విటమిన్ ఎ లోపాన్ని పూర్తి చేయడం ద్వారా వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తాయి.
- వీటి సహాయంతో చుండ్రును కూడా సులభంగా తొలగించవచ్చు. దీనికి శనగపప్పును మెత్తగా చేసి పొడి చేసుకోవాలి. నాలుగు చెంచాల నల్ల శెనగ పొడిలో నీరు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి కాసేపటి తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు తగ్గుతుంది.
- నల్ల శనగల మాస్క్ ద్వారా జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. రెండు టీస్పూన్ల నల్ల శనగ పొడికి ఒక గుడ్డు, టీస్పూన్ నిమ్మరసం, టీస్పూన్ పెరుగు కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. దీంతో జుట్టు మృదువుగా, మెరిసేలా కనిపిస్తుంది.