Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలో అందరం బాగా ఎగురుతాం. కానీ ఇప్పుడు ఎవరైనా ఇలా చేయమంటే కచ్చితంగా ఒక్కసారి ఆలోచించవలసి వస్తుంది. అవును దీనికి కారణం పెరుగుతున్న బరువు, తగ్గుతున్న సత్తువ. ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే ఇది పెరుగుతూనే ఉంటుంది. అందుకే మనం మన బాల్యంలోకి మరోసారి వెళ్లడం మంచిది. ఈ రోజు మనం స్కిప్పింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను, సరైన పద్ధతిలో ఏ సమయంలో చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం.
- తాడుతో దూకడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇది మన రక్త ప్రసరణను బాగా ఉంచుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాలు తాడాట ఆడిదే అది మనల్ని బిపి, మధుమేహం వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి.
- స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకలలో నొప్పి ఉండదు. అలాగే బీపీ నార్మల్‌గా ఉంటుంది.
- ఎంతో టెన్షన్‌తో బతికే ఈ సమయంలో స్కిప్పింగ్ చేయక తప్పదు. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, మంచి అనుభూతి చెందుతారు.
అయితే స్కిప్పింగ్ చేసేటపుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఖాళీ కడుపుతో ఎవరూ స్కిప్పింగ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల సెప్టమ్‌లో తీవ్రమైన నొప్పి వస్తుంది.
- ఆహారం తిన్న వెంటనే కూడా స్కిప్పింగ్ చేయకూడదు. కనీసం ఒక గంట గ్యాప్ ఉంచండి.
- స్కిప్పింగ్ చేయడానికి ముందు తేలికపాటి వ్యాయామం చేయండి. ఇది తాడుతో దూకినపుడు ఎటువంటి ఇబ్బందిని కలిగించదు.