Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ప్రతి రోజూ ఎన్నో వస్తువులు చెత్త బుట్టలోకి వెళుతుంటాయి. కాస్త కొత్తగా ఆలోచిస్తే వాటిని వాడుకోవచ్చు. అందరిళ్ళలో దినపత్రికలు ఉంటాయి కదా! ఆ దిన పత్రికలలో ప్రతి రోజూ అడ్వర్టయిజ్మెంట్ పేపర్లు వస్తుంటాయి. ఆ పేపర్లను పారేస్తుంటాం. మరి పారేయక వాటితో ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఆ పేపర్లకు ఒకవైపు ప్రింటయితే మరో వైపు ఖాళీగా ఉంటుంది. వీటన్నింటినీ జమ చేసి బొత్తిగా చేసి దానికో క్లిప్పు పెట్టి, ఫోన్లు చార్జింగ్ పెట్టే స్థలంలో పెట్టాలి. లేదా టీపారు మీద పెట్టుకోవాలి. ఏదైనా ఫోన్ నెంబర్ రాసుకోవడానికో లేదా అడ్రస్ రాసుకోవడానికో ఉపయోగపడుతుంది. అక్కడే ఒక పెన్ను పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హౌటళ్ళలో కూడా నాలుగు వైట్ పేపర్లు, ఒక పెన్సిల్ ఫోన్ పక్కన పెడతారు. ఇది బెడ్ పక్కనే ఉంటుంది. కవులకు అయితే బెడ్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా కవితలో ఒకటి రెండు లైన్లు గుర్తొచ్చినపుడు వెంటనే రాసుకోవచ్చు. చాలా మంది ఇళ్ళలో ఇలా పెట్టుకుంటారు.