Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా ఉద్యోగంలోకి చేరినా, ఏండ్లుగా పని చేస్తున్నా... ఎవరైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రవర్తన, అలవాట్లు, చేసే పొరపాట్ల వల్ల కెరియర్లో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
- ప్రతి కార్యాలయానికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వీటిని ఉల్లంఘించడం మీ మనుగడకు ప్రమాదమే.
- చాలామంది ఇచ్చిన పనిని పూర్తి చేశామా లేదా అనే ఆలోచిస్తారు. కానీ కొత్త ఆలోచనలు చేయడంలో విఫలమవుతారు. ఇది కూడా ఉన్నచోట ఉంచేస్తుంది.
- భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతూ వర్తమానంలో చేసే పనిపై సరిగా దృష్టి పెట్టకపోవడం.
- తోటి ఉద్యోగులతో కలవకుండా దూరంగా ఉండటం మంచి పద్ధతి కాదు. అందరూ కలిసి సమష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నది గుర్తుంచుకోవాలి.
- సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఉద్యోగోన్నతిలో అవరోధాలను సృష్టిస్తుంది.
- చిన్న పనులకే బాగా చేశానని తృప్తి చెందితే ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. లేదంటో ఎదుగుదల ఆగిపోతుంది.