Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకీ పెరుగుతున్న వేడి, దుమ్ము, కాలుష్యం.. అన్నీ చర్మం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఫలితమే ముడతలు, కాంతిని కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. అలాకాకూడదంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
హ్యాలురోనిక్ ఆసిడ్: ఇది చర్మానికి ఇంధనం లాంటిది. తేమనిస్తూనే ముడతలు, గీతల్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఎంచుకునే క్రీముల్లో హ్యాలురోనిక్ ఆసిడ్ ఉండేలా చూసుకుంటే మంచిది. నేరుగా సీరమ్ కూడా లభిస్తోంది. దాన్నైనా వాడొచ్చు.
కొలాజెన్: చర్మంలో సాగే గుణాన్ని పెంపొందించడంలో దీనిది ప్రధాన పాత్ర. సాధారణంగా ఇరవై ఏండ్లు దాటినప్పటి నుంచే ఇది క్రమంగా తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ఆహారంలో చేపలు, గుడ్డు, సిట్రస్ ఫలాలు, ఎరుపు, పసుపు కూరగాయలు, ఆకుకూరలు, జీడిపప్పు, టమాటాలను చేర్చుకోవాలి. ఇవి కొలాజెన్‌ను వృద్ధి చేస్తాయి. కొలాజెన్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన మాయిశ్చరైజర్లు మార్కెట్లో ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి.
ఎండకు దూరం: సూర్యుని నుంచి విడుదలయ్యే యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపడమే కాదు.. వృద్ధాప్య ఛాయలకూ కారణమవుతాయి. వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లకపోవడమే మేలు. తప్పనిసరి అయితే కనీసం ఎస్పీఎఫ్ 50 ఉన్న క్రీములను రాసుకోవాలి. ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది.