Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందనా దేవ్ సేన్... ఓ రచయిత్రి, ఓ నటి. బెంగాలీ కవయిత్రి అయిన తన తల్లి నబనీతా దేవ్ సేన్ రచనలను కొన్ని సంవత్సరాలుగా ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. తన తల్లి శ్రమను ప్రపంచ పాఠకుల ముందుకు ఒక పుస్తకంగా తీసుకురాబోతున్న ఆమె పరిచయం మానవి పాఠకుల కోసం...
చాలా సంవత్సరాల కిందట హార్వర్డ్‌లో అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న నేను మా అమ్మ కవితలను అనువదించడం ప్రారంభించాను. అప్పుడు అది పూర్తిగా నా అవసరాన్ని బట్టి నడిచిన పని'' అంటూ నందన దేవ్ సేన్ తన మాటలను ప్రారంభించారు. ''అమ్మ తరచుగా కవితలు చదవడానికి ఆహ్వానించబడేవారు. కానీ ఆమె రచనలు ఆంగ్లంలో చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. అయితే తన రచనలను ఆ భాషలో ప్రచురించాలనే కల ఏదో ఒక రోజు నెరవేరుతుందని ఆమె అసలు ఊహించలేదు.
తల్లితో కలిసి కవిసమ్మేళనాలకు
కోల్‌కతా నగరంలో కవిత్వాన్ని ఇష్టపడే మూడు తరాల కవులు ఉన్న ఇంటిలో పెరిగారు నందన. తల్లి తనను, తన సోదరిని చాలా కవిత్వ సమావేశాలకు తీసుకువెళ్ళేవారు. చిన్నతనంలో వారు సినిమాలకు చాలా తక్కువగా వెళ్ళేవారు. నిత్యం కవిత్వ సమావేశాలకే హాజరయ్యేవారు. రచయిత్రి, బాలల హక్కుల కార్యకర్త, అవార్డు గెలుచుకున్న నటి నందన ఇప్పటి వరకు ఆరు పిల్లల పుస్తకాలను 15 భాషల్లోకి అనువదించారు. అయితే ఆమె తాజాగా చేస్తున్న అక్రోబాట్ (జగ్గర్నాట్) పదాలను అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అక్రోబాట్ కోసం సంతకం
ఇది ఆమె తల్లి, ప్రముఖ బెంగాలీ కవయిత్రి, పద్మశ్రీ నబనీతా దేవ్ సేన్ కవితల సంకలనం. ప్రపంచ పాఠకుల కోసం ఆంగ్లంలోకి అనువదించబడింది. అక్రోబాట్ కోసం ఒప్పందంపై సంతకం చేసినపుడు అనారోగ్యంతో మంచంలో ఉన్న నబనీత ఎంతో సంతోషంగా ఉన్నారు. రెండు వారాల తర్వాత ఆమె కన్నుమూశారు. తల్లి వెళ్ళిపోయిందనే విషయాన్ని గుర్తు చేసుకోవడం నందనకు కష్టమైంది. 'అమ్మను కోల్పోయిన తర్వాత అక్రోబాట్పై పని చేసే సమయం బాగా పెరిగింది. ప్రతి కవితలో ఆమె గొంతును వినగలిగాను. ఆ సమయంలో అమ్మ చాలా దగ్గరగా ఉందనిపించినా, వాస్తవానికి చాలా దూరమయింది'' అని ఆమె చెప్పారు.
అనేక పొరలను తెలుసుకున్నాను
'ఒక అనువాదకురాలిగా నేను టెక్స్ట్‌ను ఎంటర్ చేయవలసి వచ్చింది. దానిని నా సొంతం అని క్లెయిమ్ చేయాల్సి వచ్చింది. నా తల్లిదండ్రుల వివాహ విచ్ఛిన్నంతో సహా ఆమె భావోద్వేగ చరిత్రలోని అనేక పొరలను నేను తెలుసుకున్నాను' అంటున్నారు ఆమె. నబనీత నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌ను వివాహం చేసుకున్నారు. నందన తన తల్లి రాసిన ఆరు దశాబ్దాల కవిత్వాన్ని ఒక్కసారిగా పరిశోధించడం మొదలుపెట్టింది. ఆమె తన తల్లి పనిని ప్రేమిస్తుందని హృదయపూర్వకంగా తెలుసు కాబట్టి కవిత్వంతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం పరిశోధనకు మరింత ఉపయోగపడింది.
అమ్మ పనిని అర్థం చేసుకున్నాను
''నేను మా అమ్మ ప్రేమను ఎంత గొప్పగా స్వీకరిస్తానో అదే విధంగా తన పని గురించి కూడా ప్రతిదీ అర్థం చేసుకున్నాను'' అంటున్నారు ఆమె. ''కవిత్వాన్ని అనువదించడంలో భాషా, సాంస్కృతిక, సాంకేతిక సవాళ్లను పక్కన పెట్టి, మీరు ఇష్టపడే వ్యక్తి దుఃఖాన్ని మీరు అర్థం చేసుకోలేనపుడు వారి బాధను వ్యక్తీకరించడానికి మీరు భాషను ఎలా కనుగొంటారు?'' ఇది నందనను నిరంతరం వేధించే ప్రశ్న.
సమతుల్యతను గీయడం
అనువాదాల ప్రవాహంలో అప్రయత్నంగా ఉండటం, అదే సమయంలో అసలు పనికి నమ్మకంగా ఉండటం మధ్య సమతుల్యతను గీయడం అనేది ఒక సాహిత్య రచనను అనువాదం చేసేవారికి అతిపెద్ద సవాళ్లలో ఒకటి. నందనకు అది అంత తేలిక కాదు. ''అన్ని సూక్ష్మ నైపుణ్యాలను అందజేస్తూ అమ్మ అయితే ఈ కవితను ఇంగ్లీషులో ఎలా రాసి ఉండేది?'' అని ఆమె గుర్తుచేసుకుంది. ''ఈ ప్రక్రియలో నా అనేక అనువాదాల కంటే ఆంగ్ల అనుసరణలకు దగ్గరగా ఉన్నాయి. దీని ఎంపికను నా హృదయపూర్వకంగా ఆమోదించడం ద్వారా నేను ధైర్యం పొందాను.
ఆరు శతాబ్దాల కవిత్వం
''ఆమె జీవితంలోని ప్రతి దశలో ఆమె కవిత్వం ఆమె లోతైన, అత్యంత సన్నిహిత స్వీయ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి నేను కచ్చితమైన సమతుల్యతను సాధించాలనుకున్నాను'' అంటున్నారు. నందన తన తల్లి ఆరు దశాబ్దాల ప్రకాశవంతమైన కవిత్వానికి సంకలనం కచ్చితంగా ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటుంది. అయితే ఆమె రచన ప్రధాన భాగాన్ని, విస్తృత శ్రేణిని కవర్ చేసే పద్ధతిలో కొన్ని ఎంపిక చేసుకోవాలి. సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం.
ఆమె జీవితంలోని ప్రతి దశను
''పాత, కొత్త కవితలు, పెద్దవి, చిన్నవి, ఉల్లాసకరమైన లేదా మనోహరమైన కవితలు, ప్రాసతో కూడిన లేని కవితలు ఒక స్త్రీగా, కళాకారిణిగా ఆమె జీవితంలోని ప్రతి దశను ప్రకాశవంతం చేసిన కవితల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించాలని నేను కోరుకున్నాను'' అంటున్నారు నందన.
కవిత్వం పునరుజ్జీవనాన్ని చూసింది
కవిత్వ సాధికారత, సొంత శక్తిపై రచయితకు గొప్ప విశ్వాసం ఉంది. ''మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కవిత్వం భారీ పునరుజ్జీవనాన్ని చూసింది. మా అమ్మ కవిత్వం మాత్రమే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, మాయా ఏంజెలో, మేరీ ఆలివర్ రాసిన 'ఇన్ ద బార్గెయిన్', నబనీత రాసిన 'ది ల్యాంప్' ద్వారా తనకు ఇష్టమైనవి గుర్తించగలిగాను'' అన్నారు ఆమె.
పదాలకి ప్రాణం పోసి
''మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆమె పుట్టినరోజు నాడు మా అమ్మ రాసింది. ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి అందులో ఉంది. పదాలకి ప్రాణం పోసే శక్తి ఉన్న చక్కని కవిత ఇది. అప్పట్లో ఓ రోజు మా అమ్మమ్మ నిద్రపోకుండా రాత్రంతా కూర్చొని చదువుతూనే ఉంది'' అని నందన గుర్తు చేసుకున్నారు.
అమ్మ చివరి కాలమ్
నబనీత తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఆమె తన తల్లితో చేసే అనేక సంభాషణలలో భాగంగా కవితను చదువుతుంది. ''ఆమె రాయడం మానేసి నిద్రపోయేలా చేయడం అసాధ్యం. అమ్మ చివరి కాలమ్ అర్ధరాత్రి ఆమె మంచం నుండే పంపించింది. ఆమె చనిపోవడానికి ఒక వారం ముందు అది ప్రచురించబడింది. అందులో అమ్మ తన అక్రోబాట్ సంతకం గురించి ఉత్సాహంగా ప్రకటించింది. అమ్మ ఉత్సాహంగా ఉంది. అయితే ఈ పుస్తకం ఇతర పుస్తకాల కంటే ఆమె హృదయానికి దగ్గరగా ఉందనటంలో ఆశ్చర్యం లేదు'' అంటూ నందన తన మాటలు ముగించారు.