Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో ఇంటీరియర్ డిజైన్ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. విశాలంగా నిర్మించుకున్న ఇంటిని ఆకర్షణీయంగా కనిపించేటట్లు తీర్చిదిద్దడమే వీరి పని. అందుకు అనుగుణంగా గృహోపకరణాలతో ఇంటిని ముస్తాబ్ చేస్తారు. ప్రధానంగా బెడ్ రూం, సిట్టింగ్ హాల్, డైనింగ్ రూమ్‌లను నీట్‌గా డెకరేట్ చేస్తుంటారు. డైనింగ్‌హాల్ గురించి ప్రత్యేకంగా చెప్పునక్కరలేదు. ఇంటికి వచ్చిన అతిథుల్లో ఇది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆకర్షించే కళాకృతులు, రంగులు లేదా గృహోపకరణాల ద్వారా ఇంటి యజమాని వ్యక్తిత్వాన్ని, జీవనశైలిని ప్రతిబింబించేలా డైనింగ్ రూమ్‌ను ఆకర్షణీయంగా సృష్టించడం ఎంతో కీలకం. డైనింగ్ టేబుల్‌పై ఉన్న డెకర్ కూడా డైనింగ్ రూమ్, మిగిలిన ఇంటి అలంకరణతో సరిపోలాలి. అప్పుడే అతిథుల కంటికి ఇంపుగా కనబడుతుంది. డైనింగ్ రూమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నాలుగు డెకర్ ఐడియాలను మనమూ తెలుసుకుందాం...
డైనింగ్ కమ్ లివింగ్ ఏరియా: కాంపాక్ట్ హోమ్‌లు, స్టూడియో అపార్ట్మెంట్లు, ఓపెన్-ప్లాన్-డిజైన్ హోమ్‌లకు లివింగ్, డైనింగ్ ఏరియా కలిపి ఉండడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఇది గదికి పొందికైన రూపాన్ని ఇస్తుంది. చూడటానికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. డైనింగ్ ఏరియాతో కనెక్ట్ చేయడానికి ఫర్నిచర్ కీలక అంశం. గదిలోని ఖాళీ ప్రదేశాల్లో కార్పెట్లు లేదా ఏరియా రగ్గులను కూడా వేసుకోవచ్చు.
కలపతో డిజైనింగ్: ఇంటి అనుభూతిని, రూపాన్ని తక్షణమే మెరుగుపరిచే కీలకమైన మెటీరియల్ చెక్క. దీనితో అలంకరించిన డైనింగ్ ఏరియా చూడటానికి చక్కగా ఆధునికతను ప్రతిభింబిస్తుంది. వుడ్ డెకర్‌ను ఏర్పాటు చేయడం కూడా చాలా సులభమే. ఇది ఇంటిని ఆహ్లాదకరంగా అనిపించేలా చేస్తుంది. వచ్చిన అతిథులకు ప్రత్యేకతను చాటిచెప్పడానికి టేబుల్‌కి కొన్ని ఉపకరణాలను కూడా జోడించవచ్చు.
ఇండోర్ మొక్కల పెంపకం: సింపుల్‌గా చెప్పాలంటే ఇళ్లను అలంకరించుకోవడానికి మొక్కలకు మించినవి మరొకటి లేవు. గది మూలల్లో మొక్కలు, పువ్వులు ఉంటే వాతావరణానికి సానుకూల, తాజా స్పర్శను జోడిస్తాయి. వాటిని సెంటర్‌పీస్‌గా కూడా ఉపయోగించవచ్చు. పైగా తక్కువ ధరకే లభిస్తాయి. గదికి మనోహరమైన స్పర్శను ఇస్తాయి. మొక్కలు మానసిక ఆరోగ్యంపై లోతైన, శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. దీంతో ఇంటిని అలంకరించే విషయంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి.