Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం ప్రధానంగా ఆర్థిక వెసులుబాటుతోపాటు అంతకు మించిన ధైర్యాన్నీ, తృప్తినీ ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరి ఇంత ముఖ్యమైన కొలువు జీవితకాలం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగిపోవాలంటే ఏం చేయాలి?
పని ఎప్పుడూ మొక్కుబడిగా చేయొద్దు. సాధ్యమైనంత మెరుగ్గా చేస్తూ మీరు సంతృప్తి చెందేలా చూసుకోండి. ఒక డైలాగ్‌ని నలుగురు నటులు నాలుగు విధాలుగా చెప్పినట్టు పనితీరులోనూ తేడాలుంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకత చేకూరేలా పని చేయండి.
మీ పని పట్ల మీకెంత విశ్వాసం ఉన్నా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కూడా అవసరమే. మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవడానికి అది తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే మీరు చెప్పిందే సరైందని వాదించకుండా ఎదుటివాళ్ల అభిప్రాయాలు, నిర్ణయాలకూ గౌరవం ఇవ్వండి.
పనిలో మూస విధానానికి స్వస్తి చెప్పండి. లేదంటే ఎదుగుదల ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి.