Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఇల్లు లేదా బాల్కనీని అందంగా తీర్చిదిద్దాలంటే.. దానికి బెస్ట్ ఆప్షన్ ఏవైనా రంగురంగుల, సువాసనభరితమైన మొక్కలను ఏర్పాటు చేయడం. అవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆ ప్రదేశమంతా సువాసనను వెదజల్లుతాయి. నర్సరీల్లో రకరకాల పూలమొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మొక్కలు నాటితే బాగుంటుంది అనుకునేవారికి ఈ టిప్స్. సులభంగా ఇంట్లో పెంచుకునగలిగే ఐదు సువాననభరితమైన పూల మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లూమెరియా: ఈ పూవు మన దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఇది ఎంతో సువాసనభరితమైన పూవు. ముఖ్యంగా వేసవిలో సులభంగా పెంచుకునే పూల మొక్క. దీన్ని మీ బాల్కనీల్లో గ్రో బ్యాగుల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు.
మల్లె: మన దేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ పూవును వివిధ సుగంధద్రవ్యాల్లో ఉపయోగిస్తారు. ఎంతో సువాసనను వెదజల్లె ఈ మొక్కను మీ ఇంటి బాల్కనీలో పెంచుకుంటే ఆ ప్రదేశంతోపాటు గాలివీచినప్పుడు మీ ఇంట్లోకి కూడా ఆ సువాసన వ్యాపిస్తుంది. ఈ పూవు హిమాలయాల దిగువ ప్రాంతంలో బాగా పెరుగుతుంది.
తెల్లగులాబీ: ఈ పూవు మనందరికీ తెలిసిందే. వేసవిలో ఈ గార్డెనియా మొక్కలు పూలు వికసించడం ప్రారంభిస్తాయి. దీని వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మీ బాల్కనీ గార్డెన్లో ఈ మొక్కను పెట్టుకుంటే చూడటానికి కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఎర్రగులాబీ: ఇది అందరికీ అత్యంత ఇష్టమైన గులాబీ. మంచి సువాసనగల పూలలో ఇది ఒక్కటి. ఎర్రగులాబీ వాసన కూడా చాలా మధురంగా ఉంటుంది.
నైట్ క్వీన్: ఈ నైట్ క్వీన్ పూల సువాసన రాత్రి సమయంలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే దీని పూలు రాత్రి పూట వికసిస్తాయి. అంతేకాదు ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే ఈ మొక్కలు కూడా మీ బాల్కనీ గార్డెన్‌కు చాలా బాగుంటుంది.