Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లు, వంట గిన్నెలు వంటివి రోజూ శుభ్రపరుస్తాం. దుప్పట్లు వారానికోసారి మారుస్తాం. మరి రోజూ వాషింగ్ మెషిన్ నుంచి షవర్‌హెడ్ దాకా ఇంకా ఎన్నో వాడతాం. వాటి సంగతేంటి? వీటినీ తరచూ శుభ్రం చేయాలి. అందుకు ఈ చిన్ని చిట్కాలు పాటించేయండి.
డిష్ వాషర్ ఫిిల్టర్, హోల్డర్, ర్యాకులను తొలగించి, సబ్బు, వేడినీటితో కడగాలి. తర్వాత డిష్ వాష్ డ్రెయిన్నీ శుభ్రం చేయాలి. కింద బేకింగ్ సోడా చల్లి ర్యాక్‌ను పెట్టేయండి. ఒక గిన్నెలో వెనిగర్‌ను తీసుకొని పై ర్యాక్‌లో ఉంచి మెషిన్ ఆన్‌చేస్తే సరి. ఇలా నెలకోసారి చేసి చూడండి. శుభ్రమై పోతుంది.
వాషింగ్ మిషన్ టాప్లోడైతే 50 గ్రా. బొరాక్స్, అరకప్పు వెనిగర్ వేసి మెషిన్ ఆన్‌చేయండి. వేడినీటి సెట్టింగ్ పెడితే మంచిది. ఫ్రంట్ లోడైతే మెషిన్ ఆన్ చేసి, కప్పులో మూడొంతుల వెనిగర్‌ను డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ద్వారా పంపండి. 20 నిమిషాలు ఆన్ చేయండి. తర్వాత శుభ్రంగా తుడిచి, మూత తెరచి, ఆరనివ్వాలి. మెషిన్ వాసనొస్తున్నట్టు అనిపించిన ప్రతి సారీ ఇలా చేయచ్చు. ఇలా నాలుగు నెలలకోసారి చేయొచ్చు.
టీవీ, కంప్యూటర్ తెరలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని మైక్రోఫైబర్ క్లాత్‌తో మృదువుగా తుడవాలి. చాలావరకూ పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. మరకలేమైనా కనిపిస్తే వస్త్రంపై గ్లాసు నీళ్లలో చెంచా లిక్విడ్ సోప్ కలిపిన మిశ్రమాన్ని కొన్ని చుక్కలు తీసుకొని తుడవాలి. దుమ్ము కనిపించినా కనిపించకపోయినా వారానికోసారి తప్పక తుడవాలి.
కీబోర్డు, రిమోట్.. వీటిని వెనక్కి తిప్పి సున్నితంగా తట్టండి. బటన్ల మధ్య ఇరుక్కున్న దుమ్ము, ఆహార పదార్థాలేమైనా ఉంటే పడిపోతాయి. తర్వాత వైప్ లేదా శానిటైజర్ అద్దిన వస్త్రంతో తుడిస్తే చాలు. ఇది వారానికోసారి చేయాలి.
షవర్ హెడ్ కోసం ఒక ప్లాస్టిక్ కవర్లో వైట్ వెనిగర్‌ను తీసుకోండి. ఫాసెట్, షవర్ హెడ్ మునిగేలా కవర్ అమర్చండి. గంట తర్వాత తొలగించి, టూత్‌బ్రష్‌తో రుద్దండి. నెలకోసారి ఇలా చేస్తే సరిపోతుంది.