Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటగది పని అంటే రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం మాత్రమే కాదు. వంటగది, పాత్రలను సరిగ్గా శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది లిక్విడ్ సోప్, డిటర్జెంట్ సహాయం తీసుకుంటారు. ముఖ్యంగా పాత్రలను శుభ్రం చేయడానికి. అయితే ఎప్పుడైనా వంటగదిలో డిష్ సోప్ అయిపోతే ఇంట్లో కూడా సబ్బును సిద్ధం చేసుకోవచ్చు. చాలా సార్లు పాత్రలు శుభ్రం చేయడానికి వంటగదిలో సబ్బు అయిపోతుంది. పాత్రలను పట్టించుకోకుండా వదిలిస్తేరు కొందరు. లేదంటే ఇంట్లో పడి ఉన్న ఏదైనా సబ్బుతో పాత్రలను శుభ్రం చేస్తారు ఇంకొందరు. అయితే ఇది పాత్రలలో సూక్ష్మక్రిములను నాశనం చేయదు. అటువంటి పరిస్థితిలో కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం వల్ల ఇంట్లోనే పాత్రలను సులభంగా శుభ్రం చేయడానికి సబ్బును తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం...
ముందుగా పాత్రలను నీటితో కడగాలి: పాత్రలు చాలా మురికిగా ఉంటే వాటిని శుభ్రమైన నీటితో బాగా కడగాలి. దాంతో పాత్రలపై ఉన్న ఆహారం సులభంగా తొలగిపోతుంది. పాత్రలను శుభ్రంగా ఉంచడానికి, వాసన రాకుండా ఉండటానికి బేకింగ్ సోడా తీసుకోండి. ఒక కప్పు బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కరిగించండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇది మీ పాత్రల నుండి ఆహార వాసనను తొలగించడమే కాకుండా పాత్రలు కూడా చిటికెలో మెరిపిస్తుంది.
నిమ్మరసంతో శుభ్రం చేయండి: పాత్రలు మెరుస్తూ ఉండేందుకు నిమ్మరసం సహాయం కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ పాత్రల మరకలను శుభ్రం చేయడానికి పని చేస్తుంది.
వైట్ వెనిగర్: ఆమ్ల మూలకాలు అధికంగా ఉండే డిస్టిల్డ్ వైట్ వెనిగర్ పాత్రలను క్రిములు లేకుండా చేయడానికి ఉత్తమమైన చిట్కా. ఇందుకోసం అరకప్పు వైట్ వెనిగర్‌ను పాత్రలపై రుద్ది తర్వాత శుభ్రమైన నీటితో పాత్రలను కడగాలి.
వాషింగ్ సోడాతో కడగాలి: వంటగదిలో సబ్బు అయిపోయినప్పుడు మీరు వాషింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం కొన్ని నీటిలో ఒక కప్పు వాషింగ్ సోడా వేసి పాత్రలను కడగాలి. ఇది మీ పాత్రలను పూర్తిగా శుభ్రపరుస్తుంది.
డై డిటర్జెంట్ పౌడర్‌ను తయారు చేయండి: ఇంట్లోనే డై డిటర్జెంట్ పౌడర్ తయారు చేయడానికి కప్పు బోరాక్స్, కప్పు వాషింగ్ సోడా, కప్పు సిట్రిక్ యాసిడ్, కప్పు కోషర్ ఉప్పు కలపండి. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి. వంట పాత్రలను శుభ్రపరిచేటప్పుడు ఈ డై డిటర్జెంట్ సహాయంతో మీరు పాత్రలను మెరిపించవచ్చు.
ఇంటిలో తయారు చేసిన డిటర్జెంట్ బార్: ఇంట్లో తయారుచేసిన డిష్ సబ్బును తయారు చేయడానికి ఒక గిన్నెలో కప్పు వాషింగ్ సోడా, కప్పు కోషర్ ఉప్పు, కప్పు బేకింగ్ సోడా, మూడు వంతుల కప్పు నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపి వదిలేయాలి. గట్టిపడిన తర్వాత ఈ డిటర్జెంట్ టాబ్లెట్లను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ఎప్పుడైనా వంటగదిలో సబ్బు అయిపోతే ఈ డిటర్జెంట్ బార్‌తో వెంటనే పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.