Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే బరువు సులభంగా తగ్గవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
- ఎముకలు బలంగా ఉండటానికి మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసకృత్తుల కోసం కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్లెస్ చికెన్, పల్లీల వంటివి తీసుకోవాలి.
- హోల్ వీట్, జొన్నలు, తెల్ల ఓట్స్, రాగిమాల్ట్. శెనగలు, రాజ్మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు.. వీటి వల్ల మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, 'బి' విటమిన్లు అందుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది.
- ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు.