Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెక్నాలజీ పెరిగిపోయింది. ఉరుకుల పరుగల జీవితం అయిపోయింది. ఏం తింటున్నామో, ఎక్కడ తింటున్నామో తెలియడం లేదు చాలామందికి. మరోపక్క ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారంలోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్య, అజీర్తి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి కారణం అవ్వొచ్చు. సీజన్ మారుతున్న కొద్దీ కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం.. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు అలసట, నీరసం కలుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను అనుసరించండి.
- కడుపునొప్పి నివారణకు మెంతులు మేలు చేస్తాయి. మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. కడుపులో గ్యాస్ సమస్య నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు నొప్పి తగ్గుతుంది.
- దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తిన్న తర్వాత దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల కడుపు నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- కడుపులో నొప్పి తగ్గాలంటే జీలకర్ర, కొత్తిమీర, మెంతి కూరలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.