Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు రాలడం స్త్రీ పురుషులిద్దరికీ, కొన్నిసార్లు చిన్నపిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ కొన్ని వెంటుకలను ఊడటం సహజం. అయితే వెంటుకలు రాలి, బట్టతల ప్రారంభమైతే మాత్రం సమస్యగా మారుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయట పడవచ్చు.
- ఆర్గానిక్ షాంపూలకు బదులుగా ఎస్‌ఎల్‌ఎస్ షాంపూలను ఉపయోగించడం జుట్టుకు మంచిదని డెర్మాటాలజిస్టులు సూచిస్తున్నారు. అయితే మీ జుట్టు సన్నగా, పొడిగా ఉంటే ఈ షాంపూని ఉపయోగించకూడదు.
- ఆలివ్ ఆయిల్ జుట్టుకు చాలా మంచిది. తలపై నూనె రాసుకున్నప్పుడు జుట్టు సాంద్రత మరింత పెరుగుతుంది. తరచూ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది తలకు రక్త ప్రసరణను పెంచి మూలాలను బలపరుస్తుంది.
- రోజుకు వంద దువ్వెనల వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. తలకు నూనె వస్తుంది. కానీ మరీ మితిమీరి దువ్వడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి, జుట్టు రాలడం పెరుగుతుంది.