Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో పోరాట ఏవియేటర్‌గా ప్రవేశించిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ అభిలాషా బరాక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో కెప్టెన్ సాధించిన విజయాన్ని ''గోల్డెన్ లెటర్ డే''గా పరిగణించారు. ఇటీవలె అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఐహెచ్‌క్యూ ఆఫ్ ది ఎంఓడీ (ఆర్మీ) వారి సోషల్ మీడియా ద్వారా ఈ వార్త అధికారికంగా ప్రకటించబడింది. 36 మంది ఇతర ఆర్మీ పైలట్లతో పాటు శిక్షణ పూర్తయిన తర్వాత ఆమెకు కోవెటెడ్ వింగ్స్ లభించాయి.
''శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో కంబాట్ ఏవియేటర్‌గా చేరిన మొదటి మహిళా అధికారిగా కెప్టెన్ అభిలాషా బరాక్ నిలిచింది. డైరెక్టర్ జనరల్ అండ్ కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ ద్వారా కెప్టెన్ అభిలాషా బరాక్ 36 మంది ఆర్మీ పైలట్లతో పాటు కోవెటెడ్ వింగ్స్‌ను అందుకున్నారు. యువ ఏవియేటర్లు ఇప్పుడు పోరాట ఏవియేషన్ స్క్వాడ్రన్లలో తమ ప్రతిభను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారు'' అని భారత సైన్యం యొక్క ADGPI వేడుక నుండి తీసిన చిత్రాలను పంచుకున్నారు.
భిన్నమైనదని గ్రహించలేదు
''మిలటరీ కంటోన్మెంట్స్‌లో స్థాయి పెరుగుతున్నప్పుడు, యూనిఫాంలో ఉన్న వ్యక్తులు చుట్టూ ఉన్నప్పుడు ఇది సాధారణ వ్యవహారంలా అనిపించింది. 2011లో మా నాన్న పదవీ విరమణ తర్వాత మా కుటుంబం మిలటరీ జీవితం నుండి వైదొలిగే వరకు అది భిన్నమైనదని నేనెప్పుడూ గ్రహించలేదు. 2013లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మా అన్నయ్య పాసింగ్ అవుట్ పరేడ్ చూసిన తర్వాత ఆ భావన మరింత బలపడింది. నా జీవితాంతం నేను ఏమి చేయాలనుకుంటున్నానో ఆ క్షణం నాకు తెలిసొచ్చింది'' అని కెప్టెన్ అభిలాష ఇటీవల ఇండియన్ ఆర్మీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
యుఎస్‌లో ఉద్యోగాన్ని వదలుకొని
ప్రతిష్టాత్మక ది లారెన్స్ స్కూల్, సనావర్ పూర్వ విద్యార్థి అయిన ఆమె 2016లో ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి.టెక్‌తో పట్టభద్రురాలైంది. యుఎస్ఏలోని డెలాయిట్‌లో ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే ఆ ఉద్యోగాన్ని వదులుకొని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2018లో ఆమె ఇండియన్ ఆర్మీలో చేరారు.
కొత్త ఏవియేటర్‌గా...
భారత వైమానిక దళం, నేవీకి భిన్నంగా భారత సైన్యంలో ఇప్పటి వరకు ఫ్లయింగ్ శాఖలో మహిళా అధికారులు లేరు. 26 ఏండ్ల కెప్టెన్ అభిలాష ఇప్పుడు ఆ బాధ్యతలు చేపట్టి చరిత్రను సృష్టించింది. పోరాట ఏవియేషన్ స్క్వాడ్రన్‌లో కొత్త ఏవియేటర్‌గా తన స్థానానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె త్వరలో తన సొంత అసైన్మెంట్ను పొంది హెలికాప్టర్లో ప్రయాణించనుంది.