Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన జుట్టు కోసం అన్ని చేస్తాం. ఖరీదైన షాంపూని ఉపయోగిస్తాం, ఖరీదైన జుట్టు సంరక్షణ సాధనాలను వాడతాం. ఎన్ని చేసినా జుట్టు బాగుండదు. అప్పుడు పార్లర్ ట్రీట్ మెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తాం. వీటన్నింటికి బదులుగా కలబందతో షాంపూని ఇంట్లోనే తయారు చేసుకొని మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. కలబందలో అనేక ఔషధ పదార్థాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ జుట్టు పొడవుగా, మందంగా, మృదువుగా చేయడంలో సహకరిస్తాయి. అలోవెరా షాంపూని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఎలా తయారు చేసుకోవాలి: అలోవెరా షాంపూ చేయడానికి తాజా కలబంద ఆకుల నుండి జెల్‌ను సేకరించండి. ఇప్పుడు పాన్‌లో నీటిని వేడి చేయండి. ఈ నీటిలో సబ్బు లేదా కొద్దిగా షాంపూ కలపండి. అది కరిగిపోయే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు అలోవెరా జెల్‌తో పాటు విటమిన్ ఇ, జోజోబా ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో భద్రపరుచుకోండి. దీన్ని జుట్టుకు పట్టించే ముందు బాటిల్‌ను బాగా షేక్ చేయడం మర్చిపోవద్దు.
ప్రయోజనాలు: జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తలలో దురదను తగ్గిస్తుంది. అప్పుడప్పుడు చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వల్ల తలలో దురద వస్తుంది. కలబంద షాంపూలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఈ దురదను తగ్గిస్తాయి. అలోవెరా షాంపూ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టును మృదువుగా చేస్తుంది. రసాయన జుట్టు ఉత్పత్తులు తరచుగా వేగంగా జుట్టు రాలడానికి కారణమవుతాయి. అలాకాకుండా అలోవెరా షాంపూ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తుంది.