Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు తెలియకుండా చేసే కొన్ని ఆలోచనలు, పనుల వల్ల మన సమయం వృథా అవుతుంది. దాంతో అనుకున్నది సాధించలేం. మరి సమయాన్ని మింగేసే ఆ పనులేంటో చూద్దామా...
- ఎవరో వస్తారని, మనకు స్ఫూర్తి కలిగిస్తారని, ఆశించొద్దు. మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాల నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకువస్తాయి. అంతగా ప్రాధాన్యం లేని విషయాల గురించి అతిగా ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు.
- ప్రతిదీ మీరే చేయాలనుకుంటే చివరకు ఫలితాలు ప్రతికూలంగానే వస్తాయి. నిస్సత్తువతో నీరసించిపోతారు. కాబట్టి పనులను పంచడం నేర్చుకోండి. మీ వంతు సాయం చేయడం, తీసుకోవడం లాంటివి తప్పనిసరి.
మీకు ఏది మంచిదనిపిస్తే దాన్ని చేయండి. అంతే తప్ప మీరు చేసే పనుల వల్ల ఇతరులు ఏమనుకుంటారో అని సందిగ్దం వద్దు. మీ మనసుకు నచ్చిన పని చేయండి. అప్పుడే ఆనందంగా ఉంటారు.
- అసంతృప్తి పనుల వల్ల శ్రమ, సమయం రెండూ వృథా అవుతాయి. మీరు చేయగలననే పనినే ఎంచుకోండి. లేదంటే వదిలేయండి.
- ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఎవరికివారు ప్రత్యేకం. కాబట్టి అందరినీ మెప్పించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం వల్ల చేదు, బాధకర సంఘటనలు తప్ప ఒరిగేదేమీ లేదు. ఇది మీలో అసూయ, అభద్రతను పెంచుతుంది.
- ఓ ప్రణాళిక లేకుండా, ఎలాంటి సన్నద్ధత చేయకుండా పర్ఫెక్షన్ కోసం ఎదురుచూడొద్దు. మీకేది వచ్చో, ఎంత వచ్చో ముందుగా ప్రయత్నించాలి.