Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ కొంతమందికి ఆ సమయం కూడా ఉండదు. బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటారు. ఆహారం ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు.
దీనికి చక్కటి పరిష్కారం విపరీతమైన వ్యాయామాలు చేయడమే అనుకుంటారు చాలామంది. ఎంత చక్కటి వర్కవుటైనా.. ఇన్నిసార్లు.. ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి. అయితే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌కి మనం బరువు పెరగడానికి ఓ లింక్ ఉందట. అదెలాగంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతామని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట.
ఉదయం అల్పాహారం తీసుకోకపోతే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువంట. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ఆకలి ఎక్కువగా వేయడం వల్ల.. మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తినేస్తారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 54 శాతం పెరుగుతుందట. హార్వర్డ్ యూనివర్సిటీ ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు లేని వారిలో.. డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. అవాంఛిత బరువు పెరగకుండా మీరు పీనట్ బటర్‌ను రోగ్యకరమైన ఆహారంలో వాడవచ్చు.
పీనట్ బటర్ తిన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీనట్ బటర్ వంటి ఆహారాల నుంచి తగినంత ప్రోటీన్ తినడం వల్ల ఆహారం తీసుకునేటప్పుడు కండరాలను కాపాడుకోవచ్చు.
చాలా మంది డైటర్లు పీనట్ బటర్‌కు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇందులో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. అయితే పరిమితంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశం లేదట. మరోవైపు బరువు పెరగడం మీ లక్ష్యం అయితే.. మీరు బర్న్ చేసిన దానికంటే ఎక్కువ కేలరీలు తినాలి.