Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం రోజూ కంటికి కనిపించే రకరకాల ఆహార పదార్థాలను కొని తింటాం. ఏదైనా సమస్య వచ్చే వరకు మనం దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా తగిన ప్రయోజనం లభించడం లేదు. పెద్దలు సాధారణంగా ఆహారంలో ఉప్పు, చింతపండు, పంచదార మొత్తాన్ని తగ్గించమని సలహా ఇస్తారు. వీరిలో ఉప్పు, పంచదార, సంతృప్త పిండిపదార్థాలు తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలను మనం తీసుకోకపోవడమే మంచిది. అవేంటో తెలుసుకుందాం...
కార్బోహైడ్రేట్లు: కడుపు నింపుకోవడానికి ఉదయం మంచి రుచికరమైన భోజనం చేయడం అందరికీ ఇష్టమే. ముఖ్యంగా అన్నం, గోధుమపిండి లాంటివి తీసుకుంటాం. చక్కెర కలిపిన ఉత్పత్తులను తీసుకోవడం చాలా మందికి అలవాటు. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరం.
పండ్ల రసాలు: అవును వేసవిలో దాహం తీర్చుకోవడానికి పండ్ల రసాలు తాగడం మనకు అలవాటు. కానీ చాలా దుకాణాలలో అటువంటి రసాలకు సంతృప్త చక్కెర కలుపుతారు. ఇది శారీరక శ్రేయస్సుకు హానికరం. జ్యూస్‌లను ఇంట్లోనే తయారుచేసుకుని తాగాలి.
ఫాస్ట్ ఫుడ్: రోజంతా పనిచేసి అలసిపోయాక రాత్రి భోజనానికి ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటాం. ఫ్రైడ్ రైస్ లేదా నూడుల్స్‌తో మంచూరియన్ తినడం అందరదికీ ఇష్టం. అయితే ఇది చాలా ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, సాస్‌లను కలిగి ఉంటుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
ఆలూ చిప్స్: చాలా మందికి టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ చిప్స్ తినే అలవాటు ఉంటుంది. ఇది రుచికరంగా ఉన్నప్పటికీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
టొమాటో కెచప్: సమోసాలతో పాటు టొమాటో సాస్ అని కూడా పిలిచే కెచప్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కానీ కెచప్‌లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది తరచుగా తింటే గుండెజబ్బులకు దారితస్తుంది.
వైట్ బ్రెడ్: అందరూ తినడానికి ఇష్టపడే బ్రెడ్ ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.