Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తినే ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. మన శరీరంలోని అవయవాలు బలంగా కూడా ఉండట్లేదు. చిన్న చిన్న పనులు కూడా చేయలేనంత బలహీనంగా మారిపోతున్నాం. ఇక జుట్టు యవ్వనంలోనే ఊడిపోతోంది. జుట్టు రాలుతోందని తెలిస్తే చాలు ఏదో ఆందోళన. మన దగ్గర నుంచీ ఏదో దూరమైపోతోందన్న ఇబ్బంది. తెలియకుండానే ఒక రకమైన టెన్షన్లో పడిపోతుంటారు చాలా మంది. ఇక జీవితం ముగిసిపోయినట్టుగా, ముసలితనం వచ్చేసినట్టుగా రకరకాలుగా ఊహించుకుంటూ, తమలో తామే కుమిలిపోతుంటారు. అయితే ఇంతకీ జుట్టు ఎందుకు ఇంతలా రాలిపోతుంది అంటే.. చాలా కారణాలే ఉన్నాయి. అధిక జుట్టు రాలడం, జీవంలేని జుట్టు, జుట్టు చిట్లిపోవడం, పొడిబారి పోవడం, గిరజాల జుట్టు, అల్లిన జుట్టు, హెయిర్ ఫోలికల్స్ తగ్గడం లాంటివిగా చెప్పవచ్చు. ఈ సమస్యలన్నింటికీ మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. కాబట్టి జుట్టు పెరుగుదలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
సరైన విటమిన్లు: మనం తీసుకొనే ఆహారంలో సరైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు లేకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.. ఇవన్నీ కూడా జుట్టు బలహీనమవడానికి కారణాలు. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్‌ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా జుట్టు రాలడం మొదలవుతుంది. అలాగే మన శరీరంలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
ఏం చెయ్యాలి: అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే చివరకు హెయిర్ లాస్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు. ముందుగా జుట్టు ఎందుకు రాలుతుంతో తెలిస్తే పెరగడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీ జుట్టు నాణ్యత అలాగే బలాన్ని నిర్ణయించడంలో జన్యువులు కీలకపాత్ర పోషిస్తాయి.
జుట్టు అలంకరణపై: అందమైన జుట్టు అలాగే మృదువైన జుట్టు ఉండవచ్చు. జుట్టుకు ఎక్కువ వేడి తగిలించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. వేడి జుట్టు కుదుళ్లు తాకినపుడు తల మీద ఉండే నూనెలు బయటికి పోయి చర్మం దెబ్బతింటుంది. అలాగే కుదుళ్ళు ఇబ్బందిపడి జుట్టుకు నష్టం కలుగుతుంది. జుట్టుకు ఉపయోగించే హెయిర్ డై ల కారణంగా కూడా జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఈ డై లో ఉపయోగించే రసాయనాల కారణంగా జుట్టు బలహీనంగా మారి జుట్టు రాలడానికి దారితీస్తుంది.