Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామీణ మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. వారు ఈ ఆధునిక యుగంలో ఉపాధి పొందేందుకు తన వంతు కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగానే సజే సప్నే అనే సంస్థను స్థాపించింది. ఆమే సురభి యాదవ్. ఢిల్లీలోనూ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనూ విద్యనభ్యసించి అట్టడుగు మహిళల అభ్యున్నతి కోసం తపిస్తుంది. దానికి అవసరమైన శిక్షణను అందిస్తుంది. గ్రామాల్లోని యువతులు స్థిరమైన జీతాలు పొందే, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే, వృత్తిపరమైన అభివృద్ధిని సాధించే రోజు కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం...
సెప్టెంబరు 2020లో కరోనా సేవా కార్యక్రమాల్లో ఉన్న సురభి వద్దకు బీహార్‌లోని కత్రాసిన్కు చెందిన 19 ఏండ్ల దళిత యువతి ఫూలా కుమారి వచ్చింది. ఫూలా తన సంఘంలో ఎవరూ అడగని ఒక అసాధారణ అభ్యర్థన చేసింది. ''అక్కా నాకు ఫోన్ ద్వారా డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నేర్పించండి''.
ఆమె పట్టుదల వాస్తవమైనది
''ఫూలా సంఘంలో అక్షరాస్యత శాతం ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అయితే ఆమె మాత్రం తన కలను నిజం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూడటానికి మార్గాన్ని నిర్మించదలచింది. 12వ తరగతి తర్వాత తన విద్యను కొనసాగించాలని తహతహలాడింది. అదే ఆమె సాధించిన గొప్ప ఘనత. నేర్చుకోవాలనే ఆమె పట్టుదల చాలా వాస్తవమైనది. ఈ సంఘటనే లాక్డౌన్ సమయంలో సజే సప్నేని ప్రారంభించటానికి దారితీసింది'' అని సురభి చెప్పారు.
నా హృదయానికి తాకింది
సజే సప్నే అనేది గ్రామీణ భారతదేశంలోని మహిళలు అభివృద్ధి చెందుతున్న వృత్తిలో అవకాశాలు కల్పించేందుకు సురభిచే స్థాపించబడిన ఎన్జీఓ. సురభి ఐఐటీ-ఢిల్లీ నుండి బయోకెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీలో డిగ్రీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ నుండి డెవలప్మెంట్ ప్రాక్టీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ''నేర్చుకుని ఎదగాలనే ఫులా హృదయపూర్వక కోరిక నా హృదయానికి తాకింది. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు. ఆర్థికంగా గొప్పవాళ్ళం కాకపోయినా ఆలోచించడానికి, సృష్టించడానికి కావల్సిన శక్తి సమృద్ధిగా ఉంది. చదువు కోసం పోరాడాలి అనే చనిపోయిన నా తల్లి దృఢ సంకల్పాన్ని ఇది నాకు గుర్తు చేసింది. మా అమ్మ కేవలం ఎనిమిదో తరగతితో తన చదువును ముగించేసింది. అయితే తన ఇద్దరు కూతుళ్లతో సహా మొత్తం నలుగురు పిల్లలను మాత్రం వారు కోరుకున్నంత కాలం, వారు కోరుకున్నంత వరకు చదివించేలా చేసింది'' అంటున్నారు సురభి.
సప్నేవాలీస్ నుండి ప్రేరణ
దీని మొదటి దశ సప్నేవాలీలను గుర్తించడం. ఇంటర్ తర్వాత కూడా చదవాలనే ఉత్సాహం ఉన్న గ్రామీణ మహిళలను గుర్తించడం. ఒక వైపు బుందేల్‌ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో తన భాబీలు, చాచీలు (అత్తలు) వంటి సప్నేవాలీలు ఎంతో మంది ఉన్నారని ఆమె గుర్తించింది. ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు వారంతా ఆమెను తరచుగా ''మమ్మల్ని మీ ఆఫీసులో క్లీనింగ్ లేడీగా నియమించుకోండి, మేము దీని ద్వారా నేర్చుకుంటాము. మీరు పని చేయడాన్ని చూస్తున్నారు'' అని అభ్యర్థించేవారు. స్వీయ ఎదుగుదల కోసం వారు పడే తపన ఇది. ''మరోవైపు నా గురువులు సంధ్యా గుప్తా, నేహా బుచ్, కమలా భాసిన్ వంటి సప్నేవాలీలు ఉన్నారు. వారి కలలు కేవలం తమకు మాత్రమే పరిమితం చేసుకోకుండా సమాజానికి అర్థం కావడానికి నిరంతరం కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తారు'' ఆమె జతచేస్తుంది.
సొంత సామర్థ్యాన్ని కలిగివుండేలా
సురభి కల గ్రామీణ స్త్రీలు ఎక్కడికో వెళ్లడం. వారు ఆలోచనాపరులుగా, కలలు కనేవారిగా, సృష్టికర్తలుగా తమ సొంత సామర్థ్యాన్ని కలిగి ఉండాలనేది ఆమె బలమైన కోరిక. ''ఇది రెండు విధాలుగా జరుగుతుంది. గ్రామీణ మహిళలు మా కార్యక్రమంలో చేరడానికి సంతోషిస్తున్నారు. ఎందుకంటే వారు తమ సొంత గ్రామాల్లో సాజే పూర్వ విద్యార్థులు పని చేసుకుంటూ ఎదగటాన్ని వారు చూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని సప్నేవాలీస్ విస్తృత నెట్‌వర్క్‌తో మేము సన్నిహితంగా ఉండటం. రెండవ మార్గం కమ్యూనిటీ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న లాభాపేక్ష లేని మా రిచ్ పార్టనర్ నెట్వర్క్, ముఖ్యంగా పిల్లల విద్య కోసం పని చేయడం.
మానసికంగా సిద్ధంగా ఉండాలి
సజే సప్నే ఆసక్తిగల విద్యార్థులకు సమాచార సెషన్లను నిర్వహిస్తుంది. వీరి కనీస వయసు 18 ఏండ్లు పైబడి ఉండాలి, కనీసం 11వ తరగతి వరకు చదివి ఉండాలి, ప్రాథమిక ఇంగ్లీష్ తెలుసుకోవాలి అలాగే ఇంటి నుండి దూరంగా తొమ్మిది నెలల నిడివి గల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. వారు ఎంచుకున్న కెరీర్ ట్రాక్‌పై ఆధారపడి (ప్రస్తుతం: డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ప్రైమరీ మ్యాథ్ ఎడ్యుకేటర్, వెబ్ డెవలప్మెంట్), గణిత పరిజ్ఞానం స్థాయి కూడా తనిఖీ చేయబడుతుంది. మూల్యాంకనం క్లియర్ అయిన తర్వాత విద్యార్థులు, కమ్యూనిటీ భాగస్వాములు, తల్లిదండ్రులతో జట్టు సంభాషణల సహాయంతో తొమ్మిది నెలల కోర్సు కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని సజే సప్నే నివాస ప్రాంగణాన్ని సందర్శించాలి.
ఉద్యోగం పొందేలా తీర్చిదిద్దుకోగలరు
ప్రోగ్రామ్ విచారణ-ఆధారిత బోధనా విధానాన్ని అనుసరిస్తుంది. సెషన్లు ఉపన్యాసాల ద్వారా మాత్రమే కాదు ప్రశ్నలు, వాదనలు, తర్కం ద్వారా నిర్వహించబడతాయి. ''ఇది క్యాంపస్‌లో అధ్యాపకుల పాత్ర సులభతరం చేయడం, అసైన్మెంట్లు, ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, మీ సొంత అభ్యాసానికి బాధ్యత వహించడంపై ఉంటుంది. అధికారిక జాబ్ మార్కెట్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించడానికి వారికి మార్గాలు, సాధనాలు ఇవ్వబడ్డాయి. తద్వారా వారు తమను తాము ఉద్యోగం పొందేలా తీర్చిదిద్దుకోగలరు. మా పూర్వ విద్యార్థుల వారి కొత్త ఉద్యోగాల సమయంలో అవసరమైనప్పుడు, మద్దతు, మార్గదర్శకత్వం కోసం వారు ఈ సమూహంపై ఆధారపడొచ్చు''అని సురభి చెప్పారు.
మహిళా అభ్యాసకులను ప్రోత్సహించడం
లాభాపేక్ష రహిత సంస్థ ఆవిష్కార్ యాత్ర వంటి ఇతర సంస్థలతో ఇది భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇది మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన క్యాంపస్‌ని కూడా నిర్మించుకుంది. ఇది టాటా ట్రస్ట్‌లచే నడ్జ్, సోషల్ ఆల్ఫా, సిని రంగాల ద్వారా నిధులు సమకూర్చుకుంటుంది. మొదటి తరం మహిళా అభ్యాసకులను ప్రోత్సహించడం సాజే సప్నే కర్తవ్యం. దీని మొదటి బృందం ఆరు వేర్వేరు రాష్ట్రాల నుండి 25 మంది యువతులను ఆకర్షించింది. ప్రతి ఒక్కరూ కనీసం రూ. 15,000 నుండి అత్యధికంగా రూ. 25,000 ఉద్యోగ ఆఫర్‌తో గ్రాడ్యుయేట్ అయ్యారు.
అత్యంత వెనుకబడిన కుల సమూహాలు
''మేము కేవలం జీతంపై మాత్రమే దృష్టి సారిస్తాము. అయితే కాలక్రమేణా నైపుణ్యాలు, జీతంలో మరింత వృద్ధి చెందడానికి మార్గదర్శక మద్దతు, అవకాశాలను కూడా అందిస్తుంది. ప్రస్తుత బృందంలో మేము ఏడు వేర్వేరు రాష్ట్రాల్లోని 16 వేర్వేరు గ్రామాల నుండి 45 మంది యువతులను కలిగి ఉన్నాము. వారు ప్రస్తుతం ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నారు. సజే సప్నే వారి కులం, తరగతి కారణంగా అట్టడుగున ఉన్న మొదటి తరం మహిళా అభ్యాసకులతో ప్రత్యేకంగా పనిచేస్తుంది. మా విద్యార్థులు వివిధ మతాలలోని మహాదళిత్, దళిత, బహుజన గుర్తింపుల నుండి వచ్చారు. వారు సగటు అక్షరాస్యత రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్న అత్యంత వెనుకబడిన కుల సమూహాలు. దేశంలోనే అత్యధిక పేదరిక సూచీలు కలిగి ఉన్నారు. మా విద్యార్థులందరూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చారు. వీరిలో చాలా చిన్న వయసులో వివాహం చేసుకున్న మహిళలు, ఒంటరి తల్లుల కుమార్తెలు మొదలైనవారు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరు మొదటి తరం కళాశాలకు వెళ్లేవారు. ఆమె కుటుంబంలోనే కాదు, ఆమె గ్రామంలో కూడా'' అని సరుభి జతచేశారు.
మారుమూల గ్రామాల వరకు
సప్నా కేంద్రాలను భారతదేశంలోని గ్రామ జీవితంలో అంతర్భాగంగా మార్చడం దీర్ఘకాలిక లక్ష్యం. సురభి విభిన్న కెరీర్ ట్రాక్‌ల కోసం పూర్తి విద్య, ఉపాధిని కనుగొనే ప్యాకేజీలను ప్రారంభించాలనుకుంటున్నారు. వాటిని ఇప్పటికే ఉన్న ప్రభుత్వ, లాభాపేక్షలేని మార్గాల ద్వారా మారుమూల గ్రామాలకు అందించాలనుకుంటున్నారు. లాభాపేక్ష లేని మహిళల బృందం గ్రామీణ మహిళల అభివృద్ధి ఎజెండాను వారి అవసరాలకు, వారి కోరికలకు మళ్లిస్తోంది.
నాయకత్వంలోనూ ప్రాధాన్యం
''మేము జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే, కమ్యూనికేట్ చేసే విధానాన్ని మారుస్తున్నాము. అధిక నాణ్యత, వృత్తి నైపుణ్య పాఠ్యాంశాలను ఆంగ్లేతర భాషల్లోకి క్యూరేట్ చేయడం, సృష్టించడం ద్వారా దీన్ని చేస్తాము. మేము ప్రొఫెషనలిజం నిర్వచించబడిన విధానాన్ని, ఉత్పాదకత, నాయకత్వ విషయంలో కూడా పురుషులతో సమానంగా గ్రామీణ యువతులకు చోటు కల్పించేలా మారుస్తున్నాము. యంగ్ డెవలప్మెంట్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న సజే మొదటి కోహోర్ట్ నుండి పట్టభద్రులైన ప్రతి విద్యార్థి వారి కులం, తరగతి, లింగం, భౌగోళిక పరిస్థితుల ద్వారా తయారు చేయబడిన గాజు పైకప్పులను పగులగొట్టారు'' అని సురభి చెప్పారు.
ఎవరికోసమో ఎదురు చూడకుండా
గ్రామాల్లోని యువతులు స్థిరమైన జీతాలు పొందే, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే, వృత్తిపరమైన అభివృద్ధిని సాధించే రోజు కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. ''గ్రామీణ స్త్రీలలో ప్రధాన స్రవంతి ఎవరి కోసమో ఎదురు చూడకుండా, ఎవరి కోసమే తాము వస్తువులుగా మారకుండా, వారి సొంత గుర్తింపుల కోసం చూసే రోజు వస్తుంది. ప్రధాన స్రవంతిలో ఇలాంటి మార్పు వచ్చినపుడే మేము విజయం సాధించినట్టు'' అని సురభి ముగించారు.