Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామిడిపండ్లు, పుచ్చకాయల వంటివి బయటి వాతావరణంలోనే చక్కగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్లో పెడితే రుచిని కోల్పోతాయి. ఆ తర్వాత మనం వాటిని తిన్నా రుచీపచీ లేకుండా చప్పగా ఉంటాయి.
- ముఖ్యంగా పుచ్చకాయను కోశాక ఫ్రిజ్లో పెట్టకూడదు. అలా చేస్తే దాని రుచి పోతుంది. త్వరగా పాడైపోతుంది కూడా. ముక్కల్ని ఫ్రిజ్లో పెట్టక తప్పదు అనుకుంటే వాటిపై ఓ కవర్ కప్పి అప్పుడు పెట్టాలి.
- మామిడి పండ్లను ఇంటికి తెచ్చాక కాసేపు చల్లటి నీటిలో ఉంచి, ఆ తర్వాత వాటిని కడిగి సాధారణ రూం టెంపరేచర్లోనే ఉంచాలి. ఫ్రిజ్లో పెట్టకూడదు. ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు వాటిని కట్ చేసి కాసేపు ఫ్రిజ్లో పెట్టి తినాలి తప్ప ముందే ఫ్రిజ్లో పెట్టకూడదు.
- ఇక కూరగాయలు, పండ్లను ఒకే చోట ఉంచకూడదు. వాటిని వేర్వేరు ట్రేలలో ఉంచడం మేలు. ఎందుకంటే వాటిలో రకరకాల గ్యాసులు రిలీజ్ అవుతుంటాయి. పక్కపక్కనే వాటిని కలిపి ఉంచితే వాటి రుచి మారిపోతుంది. అందువల్ల వాటిని వేర్వేరుగా ఉంచడం కరెక్టు.