Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ ఎంత ధైర్యవంతురాలైనా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలవంతురాలైనా ప్రతి నెలా వచ్చే ఈ రుతుక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు రుతుక్రమం ప్రారంభమైన మొదటి రెండు రోజులు కొనసాగవచ్చు. అదే సమయంలో అనివార్య కారణాల వల్ల మహిళలు తరచుగా బహిష్టు సమయంలో పని చేయవలసి వస్తుంది. అదే సమయంలో రుతు తిమ్మిరిని ఎదుర్కోవడానికి మహిళలు నివారణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. అవేంటో తెలుసుకుందాం...
అరటిపండు స్మూతీ: ఇది రుతుస్రావ నొప్పికి అద్భుతమైన ఔషధం మాత్రమే కాదు, రుచిలో కూడా అద్భుతమైనది. ఈ స్మూతీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. అరటిపండును తీసుకుని మెత్తగా చేయాలి. 350 మి.లీ పాలు, రెండు టీస్పూన్ల పులియని పెరుగు, ఒక టీస్పూన్ వెన్న, రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు, చిటికెడు యాలకుల పొడిని కలపాలి. నాలుగు బాదం పప్పులు వేసి మిక్సీ పట్టాలి. ఇది మీ రుతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
బాదంలో ఉండే పోషకాలు: ఇది కండరాల తిమ్మిరిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండులోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా సబ్జా గింజలు హార్మోన్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.