Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే కాకుండా మీ ఇంటికే కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అది ఎలాగో చూద్దాం..
పాత కుర్చీలను కొత్తగా: చాలా మంది ఇళ్లల్లో వుడెన్ చైర్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం వాడుతుంటాం కాబట్టి.. చూడ్డానికి పాతగా అయిపోతాయి. అయితే ఇవి మరీ పాతగా అయిపోతే స్టోర్ రూమ్‌లో పడేస్తుంటారు. ఇలా కాకుండా వీటిని మీరు ఏ రూమ్‌లో పెట్టాలనుకుంటున్నారో ఆ రూమ్ గోడలకు సరిపోయే రంగులను ఎంచుకుని ఆ రంగుని వాటికి వేయండి. అంతే కాదు... వాటికి కుషన్లు, పిల్లో కవర్స్ మార్చండి. దాంతో అవి మళ్లీ కొత్తగా కనిపిస్తాయి.
పాత కిటీకీ తలుపులను: చాలా మంది పాత తలుపులు, కిటికీలను తీసి పడేస్తుంటారు. అయితే కాస్తా క్రియేటివిటీగా ఆలోచిస్తే వీటిని కొత్తగా మలుచుకోవచ్చు. అదెలాగంటే.. ఆ కిటికీలను, తలుపులను మీకు ఇష్టమైన ఆకారంలో అంటే త్రిభుజాకారం, గుండ్రని ఆకారాల్లో కట్ చేయండి. వీటిని ఓ నాలుగు దిక్కులను కలుపుతూ అతికించండి.. ఇప్పుడు దీనిపై మార్కెట్లో దొరికే రకరకాల డిజైన్స్‌లో ఉండే గ్లాస్ స్లాబ్ తీసుకొచ్చి అతికించండి. అంతే మీకు మంచి సైడ్ టేబుల్ రెడీ అయినట్టే. చూడ్డానికి కూడా ఎంతో బావుంటుంది.
లాంప్ షేడ్: చాలా మంది ఇంటికి అందం తీసుకొచ్చేందురకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఒకటి మంచి రఫుల్ లాంప్ షేడ్.. దీన్ని తయారు చేయడం కోసం పాత లాంప్ షేడ్‌ని తీసుకోండి.. దీనికి లెనిన్ క్లాత్‌తో రఫుల్స్‌లా కట్ చేసి అతికించండి. లాంప్ షేడ్‌కి ఏదైనా మంచి రంగుతో పేయింట్ వేయండి. అదే రంగులో లెనిన్ క్లాత్ తీసుకుంటే లాంప్ షేడ్ మరింత అందంగా ఉంటుంది. దీన్ని తయారు చేశాక కాస్తా ఆరిన తర్వాత అందులో మంచి లైటింగ్ పెట్టండి. ఇది మీ ఇంటికి కచ్చితంగా కొత్త అందాన్ని తీసుకొస్తుంది.
సూట్ కేసులు: సూట్ కేసులు చాలా మంది కొంటుంటారు. కొత్తవి కొనగానే పాత వాటిని పడేస్తుంటారు. అలా కాకుండా వాటిని మీ వార్డ్‌రోబ్‌లో పెట్టేయండి. లేదా బెడ్ చివర, కిందగానీ పెట్టేయండి. ఇందులో మీ బుక్స్ కానీ, దుప్పట్లు కాని పెడుతుంటుండి. ఇలా చేయడం వల్ల మీ పాత సూట్‌కేసులను వాడుతున్నట్టు ఉంటుంది. ఇంటిలో పాత వస్తువులను కూడా దాచినట్టుఉంటుంది.
పాత కర్టెన్లను కొత్తగా: కర్టెన్స్ కూడా చూసి చూసి బోర్ కొడుతుంటే వాటిని కొత్తగా మార్చొచ్చు. కర్టెన్ల చివర రకరకాల రంగుల పొంపోలను అతికించండి. ఇదే ఐడియా దిండ్లు, కుషన్లకి కూడా వాడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మీ ఇంటి రూపే మారి అందంగా కనిపిస్తుంది.