Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపా కుమార్... మహిళల జీవన నాణ్యతను మార్చి, మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో యష్రామ్ లైఫ్‌స్టైల్‌ను ప్రారంభించారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య నుండి ఆమెకు ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. మహిళల జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన ఆ సమయంలో వారికి మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసమే ఆమె సృష్టించిన 'పీరియడ్ ప్యాంటీ' గురించి మరిన్ని విశేషాలు...
ప్రస్తుతం దీపా తన టీమ్‌ను ఒక వ్యాపార మైలురాయి నుండి మరొక మైలురాయికి నడిపిస్తుంది. కంపెనీ ఉత్పత్తి, అభివృద్ధి, ఆవిష్కరణలను కూడా ఆమె పర్యవేక్షిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ఆఫీస్ మార్చి 2015లో 'శానిటరీ అండర్గార్మెంట్' ఆలోచన కోసం ఆమెకు పేటెంట్ జారీ చేసింది. అయితే భారతీయ పేటెంట్ ఆఫీస్ ఫిబ్రవరి 2019లో అదే ఉత్పత్తికి పేటెంట్‌ను జారీ చేసింది. ఆమె ప్రారంభించిన అత్యంత విజయవంతమైన ఆవిష్కరణ 'పీరియడ్ ప్యాంటీ' నమ్మకమైన కస్టమర్లను ఆకర్షించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుంది.
మహిళలకు ఉపాధి కల్పిస్తూ
కొంతమంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక చిన్న వ్యాపారం ప్రారంభించబడింది. ఇప్పుడు అదే ఎనిమిది కోట్ల వార్షిక పునరావృత ఆదాయం కలిగిన సంస్థగా నిలిచింది. దీనిలోని విభాగాల్లో 50 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. తయారీ విభాగం చిన్న కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌ల నుండి మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. దానికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తుంది. శిక్షణ తద్వారా మహిళలకు ఉపాధి పెరుగుతుందని ఆమె ఉద్దేశం.
కాలుష్యాన్ని నివారించేందుకు
అనేక అధ్యయనాల ప్రకారం ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్న శానిటరీ న్యాప్కిన్లు 90శాతం వరకు ప్లాస్టిక్‌తో తయారు చేయబడతాయి. ఒకసారి వాడి పారవేసిన తర్వాత వాటి వల్ల భూమి విపరీతమైన కాలుష్యానికి గురౌతుందని చాలా మంది మహిళలకు తెలియదు. ప్రతి సంవత్సరం దాదాపు 12,3 బిలియన్లు లేదా 113,000 టన్నుల పాత శానిటరీ ప్యాడ్లు భారతదేశంలోని పల్లపు ప్రదేశాలలో వదిలేస్తున్నారు. ఇది దేశంలో ప్లాస్టిక్ కాలుష్యానికి దోహదం చేస్తుంది. అందుకే ప్రస్తుతం అందరిలో పునర్వినియోగ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్పులు, పీరియడ్ ప్యాంటీ మొదలైన దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాలపై అవగాహన పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలతో ప్రస్తుతం స్త్రతీవవఅ ఎవఅర్తీబa్‌ఱశీఅ ముందుకు సాగుతుంది.
లైంగిక వేధింపులతో పాటు
సౌర్యవంతమైన స్థిరమైన పరిష్కారాలను సృష్టించడమే కాకుండా దీపా, ఆమె బృందం వారి సామాజిక ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. అదే 'మీ పిల్లలకు ఎలా చెప్పాలి'. దీనిపై కూడా ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఇది గ్లోబల్ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తమ యుక్తవయసు పిల్లలతో లైంగిక వేధింపులతో పాటు ఇతర విషయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునేలా అవగహాన కల్పిస్తుంది. దాంతో అమ్మాయిలు వారి శరీరాలపై సానుకూల విశ్వాసాన్ని పొందగలుగుతారని దీప అంటున్నారు.
శరీరానికి అనుకూలంగా...
''పీరియడ్ స్టెయిన్స్ అనేది ఆ రోజులలో మనం అనుభవించే ఒత్తిడితో కూడుకున్న విషయం. అందువల్ల నేను ఆదిరా పీరియడ్ ప్యాంటీని కనిపెట్టాను. ఇది చర్మానికి, శ్వాసక్రియకు అనుకూలమైన కాటన్‌తో చేసినది. దీన్ని ఉపయోగించిన తర్వాత ఉతికి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది లీక్ ప్రూఫ్ ప్యాంటీ. అదనంగా ఇది ప్యాడ్‌ను తన స్థానంలో కదలకుండా, నలగకుండా ఉంచుతుంది''అని దీప వివరిస్తుంది.