Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యకరమైన గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు మీ ఆహారంలో కొన్ని డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. ఎండిన పండ్లు చాలా ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది దీర్ఘకాలం పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండిన పండ్లలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లతో పాటు వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. షేక్స్, స్మూతీస్, స్నాక్స్, సలాడ్లు మొదలైన వాటిలో డ్రైఫ్రూట్స్‌ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పరిమిత మోతాదులో డ్రైఫ్రూట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. ఇది రక్త నాళాలలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. అదనంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది. ఇది హార్ట్ బ్లాక్ లేదా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను సులభతరం చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచే ఐదు రకాల డ్రైఫ్రూట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బాదం: ఒక నివేదిక ప్రకారం బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బాదంపప్పును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని నివారిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది
వాల్నట్: వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్ అధిక రక్తపోటును తగ్గిస్తాయి. శరీరం, గుండె అంతటా రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. రోజుకు ఒకటి నుండి రెండు వాల్నట్లను తినడం వల్ల హార్ట్‌లో బ్లాక్ ఏర్పడదు.
పిస్తా: పిస్తాపప్పులో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
జీడిపప్పు: ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు రోజుకు ఐదు నుండి ఏడు గింజలు తింటే మీ గుండె సరిగ్గా పని చేస్తుంది. ఒలివ్ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీడిపప్పులో కాపర్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పల్లీలు: వీటిని తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. పల్లీల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అదనంగా ఇవి కేలరీలు, కొవ్వులు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా చెప్పుకోవచ్చు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వారానికి రెండుసార్లు పల్లీలు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుంది.