Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్నచూపు. ప్లేట్లో కనిపించగానే తీసి పక్కన పెడతారు చాలా మంది. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
విటమిన్లు: కరివేపాకును చాలామంది ఆహారం రుచి, వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసినా పట్టించుకోరు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సి ని సరఫరా చేస్తాయి. కరివేపాకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్: కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
బరువు నియంత్రణ: కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది మనం అధిక బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
మెదడుకు ప్రయోజనం: హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఆకులను నీటిలో ఉడకబెట్టి దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారమవుతుంది.