Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం అంటే కత్తి మీద సామే. మన జీవితాలు అలా మారిపోయాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం? అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
- ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా దొరుకుతోంది. ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండటంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు. అలా చెయ్యకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రేటు ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు.
- డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్ టాప్, టాబ్లెట్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంతవరకూ తగ్గించుకోవాలి. ఇవి నిద్రను దూరం చేస్తాయి. నిద్రపోయే అరగంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లను క్లోజ్ చేయడం మేలు.
- ఆరోగ్యం కోసం కొంత టైమ్ తీసుకోవాలి. వీలైనంతవరకూ నడిచేందుకు ప్రయత్నించండి. ఆఫీస్‌కి నడిచివెళ్లండి. దూరం అనుకుంటే బస్టాండ్ వరకైనా నడిచి వెళ్లండి. వీకెండ్లోనైనా పచ్చిక మైదానాల్లో తిరగండి. వాకింగ్తోపాటూ ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. కనీసం రోజుకు పావు గంటైనా చెయ్యాలి.