Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాలరీలు తక్కువగా ఉండే బాదం పప్పును చాలామంది బరువు తగ్గించుకోవడానికి స్నాక్స్‌గా వినియోగిస్తారు. ఇందులోని విటమిన్-ఇతో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని నిత్యం తీసుకునే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న బాదం పప్పుతో ముఖం పైన ముడతలు, పిగ్మెంటేషన్ మచ్చలు కూడా మాయమవుతాయని చెబుతున్నారు నిపుణులు.
- బాదం పప్పులో అధికంగా ఉండే ఆల్ఫా టోకోఫెరాల్ కారణంగానే ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రత తగ్గుతుందట. బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్ (విటమిన్-ఇ), అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో మహిళల ముఖం పైన ఏర్పడే ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి అంటున్నారు చర్మసౌందర్య నిపుణులు.
- ప్రతిరోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులొస్తాయి. బాదం పప్పుల్లో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు తమ రోజువారీ డైట్‌లో బాదం పప్పులను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం అని వారు సూచిస్తున్నారు. ప