Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిపూర్ణ ఆరోగ్యం సాధించాలనుకునే విరామం ముఖ్యం అంటున్నారు నిపుణులు. దీంతో శారీరకంగానే కాదు మానసికంగా నూతనోత్తేజం వస్తుందంటున్నారు. అయితే పొద్దున లేస్తే.. ఇల్లు, పిల్లలు, ఆఫీసు... ఇన్ని పనుల మధ్య విరామం దొరకడం కష్టమే. అయితే ఈ పనుల్ని మరింత ప్రభావవంతంగా, సృజనాత్మకంగా, సంతోషంగా చేయాలంటే విరామం అవసరం. విశ్రాంతి అంటే నిద్ర సమయమే అనుకుంటారు చాలామంది. అది మాత్రమే కాదు పని, ఆలోచనలు, వ్యాయామం, భావోద్వేగాలు.. వీటన్నింటినుంచీ విరామం ఉండాలి.
- దీని కోసం ప్రకృతిని ఆశ్రయించండి. ఒక పార్కులోనో లేదంటే మీకు అవకాశం ఉంటే సరస్సు, సముద్ర తీరాన నడిచి చూడండి.
- మీకు సరదానిచ్చే, మీరెంతో ఇష్టపడే హాబీకి కొంత సమయం కేటాయించండి. ఇందులో ఒక రకమైన ఆనందం ఉంటుంది. అది మీ సృజనాత్మకతను పెంచుతుంది. లేదంటే మ్యూజియాలకు వెళ్లి వేరొకరి సృజనాత్మకను పరిశీలించండి. అది స్ఫూర్తినీ కలిగిస్తుంది.
- ఏవైనా రెండు పనుల మధ్య కొద్ది సేపు విరామం ఉండేలా చూసుకోండి.
- వీలున్నప్పుడల్లా మీ ఫోన్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి.
- ఇష్టంలేని పార్టీలకు వెళ్లకండి. ఆ సమయం మీకు ఇష్టమైన పనులకి కేటాయించుకుని రీఛార్జ్ అవ్వండి.
- ఆర్థిక ప్రయోజనంకంటే మానసికంగా సంతృప్తినిచ్చేలా ఏదైనా సామాజిక కార్యక్రమంలో వాలంటీరుగా పనిచేయండి.