Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మొలకలతో నోరూరించేలా... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

మొలకలతో నోరూరించేలా...

Thu 16 Jun 04:02:41.322929 2022

       మొలకెత్తిన విత్తనాలు తింటే మన శరీరానికి కావల్సినన్ని పోషకాలు లభిస్తాయన్నది నిపుణుల సూచన. అందుకే ఈ మధ్య కాలంలో వీటి ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. అయితే చాలామంది వాటిని నేరుగా తినటానికి ఇష్టపడరు. పిల్లలైతే వీటిని చూస్తూనే ముఖం తిప్పేస్తారు. అందుకే నేరుగా తినకుండా రుచికరమైన పదార్థాలను వండుకుని తింటే ఇంకెంత బావుంటుందో కదా! ఒకసారి మనమూ ట్రై చేద్దామా మరి...
సలాడ్‌
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - అర కిలో, ఉల్లిగడ్డ - ఒకటి, టమాట - ఒకటి (సన్నగా తరగాలి), కారం - పావు టీ స్పూను, చాట్‌ మసాలా - టీ స్పూను, నిమ్మరసం - టీ స్పూను, ఆలూ లేదా మోరంగడ్డ - ఒకటి (ఉడికించాలి), కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా మొలకల్ని నీళ్లతో కడగాలి. నీళ్లు పోసి ఉడకబెట్టాలి. వీటికి పైన చెప్పిన పదార్థాలన్నీ చేర్చి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర కూడా చేర్చి కలిపి సర్వ్‌ చేయాలి.

చట్నీ
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, చింతపండు - నిమ్మకాయంత, అల్లం - చిన్న ముక్క, ఉల్లిగడ్డ - ఒకటి, కందిపప్పు - మూడు టీస్పూన్లు, ధనియాలు - టీస్పూను, పండుమిర్చి - నాలుగు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - సరిపడా, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సన్నగా తరగాలి. బాండీలో నూనె వేడి చేసి కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మిగిలిన నూనెలో తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మొలకలు వేసి దోరగా వేయించి తీయాలి. అన్నీ చల్లారాక మొదట కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు మిక్సీలో వేసి తిప్పాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం, ఉల్లి మిశ్రమం వేసి తిప్పాలి. చివర్లో మొలకలు వేసి పలుకుగా మారాక తీసి వేడి అన్నంతో తినాలి.

వడ
కావల్సిన పదార్థాలు: శనగ మొలకలు - పావు కిలో, బియ్యంపిండి - అరకప్పు, ఉల్లిగడ్డ - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - రెండు టీస్ఫూన్లు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - కొన్ని, ఉప్పు - సరిపడా, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ సన్నగా తరగాలి. శనగ మొలకలు, పచ్చిమిర్చి, కారం మిక్సీలో వేసి పేస్ట్‌ చేసుకోవాలి. దీనికి ఉల్లి ముక్కలు, బియ్యంపిండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. బాండీలో నూనె వేడి చేసి ఈ పిండిని చిన్న ముద్దలు తీసుకుని వడల్లా వేసి వేయించుకోవాలి.

చపాతి
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, గోధుమ పిండి - రెండు కప్పులు, పనీర్‌ తురుము - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి - మూడు రెబ్బలు, ఉప్పు, నెయ్యి, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు పోసి పిండిని ముద్దగా కలిపి పెట్టుకోవాలి. మొలకల్ని ఉడికించి పలుకుగా రుబ్బి పక్కనుంచాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించి మొలకల ముద్ద, పనీర్‌, ఉప్పు వేసి కలిపి పొయ్యి నుంచి దింపాలి. తర్వాత పిండితో చపాతీలు ఒత్తుకోవాలి. రెండు చపాతీల మధ్య చేసి పెట్టుకున్న మొలకల మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె పోసి ఈ చపాతీలు రెండు వైపులా కాల్చుకుని సర్వ్‌ చేయాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎందరో తల్లుల త్యాగ ఫలితం
సాంప్రదాయ సంకెళ్ళను తెంచుకొని మాతృదేశం కోసం ఉద్యమించి
ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి
ఇట్ల చేద్దాం
దేశం కోసం ఇల్లు వదిలింది
ఎగిసిపడ్డ మహిళా కెరటం
సాహస మహిళల పోరాటం
ఆపదలో అండే నిజమైన స్నేహం
ఏదీ ఆమెను ఆపలేదు
ఇట్ల చేద్దాం
ఈ మార్పులు సాధారణమే
త్వరగా యుక్తవయసుకు వస్తున్నారా..?
హస్తకళాకారులను బలోపేతం చేయడమే సదాఫ్‌ లక్ష్యం
మహిళల జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది
అమ్మ కోసం
రుచికి, ఆరోగ్యానికి కిచిడీ
ఆటంకాలు రాకుండా...
కోరుకున్నది దొరక్కపోతే
కాఫీ తాగితే తలనొప్పి
ఇట్ల చేద్దాం
మాకు ప్రత్యేక దుస్తులు అవసరం
కలుపు మొక్కల నుండి అద్భుతాలు
టెన్షన్‌ పడుతున్నారా..?
ఇట్ల చేద్దాం
నిరుపేద పిల్లల క్రీడా సాధికారతకై
కండ్లు జాగ్రత్త
ఇట్ల చేద్దాం
బరువు పెరగాలంటే..?
కల్పనా చావ్లాని అనుసరించాను
ధౌలగిరిని అధిరోహిస్తాను
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.