Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మహిళకు తనకంటూ సొంత ఆదాయం ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. కుటుంబ బాధ్యతలరీత్యా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం దొరకదు. అయితే కాస్త నైపుణ్యం, ఆలోచనా శక్తి ఉండాలేకానీ కెరీర్ రూపొందించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు. తమ అభిరుచులను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దానికోసం డిజిటల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. వారే మలార్, కబీర్, ఏక్తా. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్‌ను ప్రారంభించి లక్షలమందిని తమ అభిమానులుగా మార్చుకున్న వారి పరిచయం...
చెన్నైకి దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజపాళయం. అక్కడి టెక్స్టైల్ హబ్‌లో 18 ఏండ్ల మలార్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబ పరిస్థితుల కారణంగా మలార్ ఇంటర్ తర్వాత తన చదువుకు స్వస్తి చెప్పి పెండ్లి చేసుకోవలసి వచ్చింది. అయితే మలార్ తన కాబోయే భర్తకు ఒక షరతు పెట్టింది. తన కుటుంబాన్ని పోషించడానికి పెండ్లి తర్వాత ఉద్యోగం చేస్తానని చెప్పింది.
స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు
ఇదంతా 2000 సంవత్సరంలో జరిగింది. తర్వాత ఆమె దూరవిద్య ద్వారా డిగ్రీని పూర్తి చేసింది. కిండర్ గార్టెన్ టీచర్‌గా పనిచేసింది. పిల్లలకు ప్రైవేట్ ట్యూటరింగ్ ప్రారంభించింది. కష్టపడి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది. యూటూబ్‌ను క్రియేట్ చేసి అందులో పాఠాలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కు లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు మలార్ తన సొంత యూట్యూబ్ ఛానెల్, కైజెన్ ఇంగ్లీష్‌తో పాటు చెన్నై, రాజపాళయంలో రెండు స్పోకెన్ ఇంగ్లీషు కేంద్రాలను నిర్వహిస్తోంది. చెన్నైలో తన కేంద్రాన్ని ప్రారంభించి ఛానల్ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంతో ఒక అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది.
ప్రజాదరణ పొందాను
''నేను స్టేట్ బోర్డ్ స్కూల్లో చదివాను. పాఠాలు చెప్పడం ప్రారంభించినప్పుడు నాకు ఒక ఆంగ్లో-ఇండియన్ సహౌద్యోగి ఉండేది. ఆమె అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేది. ఆమె నుండి నేను చాలా ప్రేరణ పొందాను. ఆమె నా ఉచ్చారణను సరిచేసేది. కాలక్రమేణ నేను స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లో చేరాను. అక్కడ విద్యార్థులు నేను బోధించే విధానాన్ని ఇష్టపడ్డారు. ప్రజాదరణ పొందాను. అక్కడ నన్ను వ్యాపార భాగస్వామిగా చేయమని అడిగారు. కానీ నేను ఆ వెంచర్లో మోసపోయాను. దాంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. కానీ విద్యార్థులు మాత్రం నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. వారి అభిమానమే రాజపాళయంలోని నా చిన్న ఇంటిలోనే సొంత సంస్థను ప్రారంభించేలా చేసింది. కేంద్రాన్ని ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత 2017లో యూట్యూబ్‌లో పాఠాలను అప్లోడ్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు నేను ఆన్లైన్లో తరగతులను నడుపుతున్నాను. సొంతంగా రెండు కేంద్రాలను నిర్వహిస్తున్నాను. బెంగళూరుతో పాటు ఇతర మెట్రోలలో కేంద్రాలలో ఎప్పుడు తెరుస్తానని ప్రజలు నన్ను అడుగుతూనే ఉన్నారు'' అని ఆమె చెప్పింది.
పేద పిల్లలకు అందుబాటులో
మలార్ తదుపరి లక్ష్యం ఈ పాఠాలను నిరుపేద పిల్లలకు అందుబాటులో ఉంచడం. ''ఈ పాఠాలు మారుమూల ప్రాంతాలకు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా అవి వెనుకబడిన పిల్లలకు కూడా సహాయపడతాయి. నేను కొత్తగా నేర్చుకునే వారికి ఆల్ఫాబెట్స్ మొదలైన వాటిపై ప్రాథమిక పాఠాలతో వీడియోలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ వీడియోలను ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నా'' అని ఆమె జతచేస్తుంది.
ఇంటర్నెట్ రాక ముందు
మలార్ వంటి అనేక మంది మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడటానికి డిజిటల్ మీడియా సహాయపడింది. ఇంటర్నెట్ మన జీవన విధానంగా మారడానికి చాలా కాలం ముందు కుటుంబ బాధ్యతలకు కట్టుబడి పూర్తి సమయం పని చేయలేని పరిస్థితుల్లో మహిళలు ఉండేవారు. దాంతో తమ కలలను వదులుకోవలసి వచ్చేది. ఇంట్లోనే ఉంటూ ఆదాయం పొందే విషయంలో చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయి. కొందరు గహ ఆధారిత శిక్షణను తీసుకున్నారు. మరికొందరు ఎల్ఐసి పాలసీలు కట్టించేవారు. కొందరు ఆమ్వే పంపిణీదారులుగా మారారు. అయితే ఇవి స్థిర ఆదాయానికి హామీ ఇవ్వలేదు. చాలా మంది గహిణులకు సంపాదన కంటే లేబుల్ చేయడం గురించి స్పహ ఉంది. ఇది ఒక సామాజిక అవగాహన.
కబితాస్ కిచెన్
కబితాస్ కిచెన్ టేక్ ఫుడ్ బ్లాగర్, యూట్యూబర్ కబితా సింగ్ గహిణిగా పేరు తెచ్చుకోవడం కంటే కంటెంట్ క్రియేటర్ లేదా యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం తనకెంతో ఇష్టమని చెబుతుంది. ''నేను నా సహచరులను లేదా ఇతరులను కలిసినప్పుడల్లా చాలా మంది మహిళటటలు ఐటీలో పనిచేస్తున్నారు. కానీ నేను దాన్ని విడిచిపెట్టబడ్డాను. అయితే నన్ను నేను కేవలం గహిణిగా చూడాలని కోరుకోలేదు. అది కష్టతరమైన పని అని నాకు తెలుసు'' అని పూణేకి చెందిన కబితా చెప్పారు.
ఎవరికీ చెప్పకుండా
కబితా రిఫ్రెష్ స్పాంటేనిటీ, సరళమైన, సులభమైన వంట వీడియోలు యూట్యూబ్‌లో 12 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించాయి. 2014లో ఆమె మొదటిసారిగా వీడియో షూట్ చేసినపుడు గురైనప్పుడు తన కంటెంట్‌ని సష్టించడానికి ఓ స్నేహితురాలు తన సహకారం తీసుకుంది. వీడియోను ఎడిట్ చేయడంలో సహాయం చేసినందుకు నాకు రూ. 5,000 ఇచ్చింది. అదే ఆమెను సంపాదించడం నేర్చుకునేలా చేసింది. ''నేను ఆన్లైన్లో కంటెంట్‌ను ఎలా సష్టించాలో యూట్యూబ్ వీడియోలను చాలా చూశాను. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అని నా భర్తకు చెప్పాను. ముందు నా వంట వీడియోను చిత్రీకరించడం ప్రారంభించాను. దానికి నాకు 10-15 రోజులు పట్టింది. చివరికి నేను ఎవరికీ చెప్పకుండా ఆలూ-బిండి సబ్జీని ప్రాథమికంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు కాల్ చేయడం ప్రారంభించారు'' అని కబితా చెప్పింది.
ఫీడ్‌బ్యాక్ సంతృప్తినిస్తుంది
బ్రెడ్ గులాబ్ జామూన్ కోసం రెసిపీని పోస్ట్ చేయడంతో ఆమె కబితాస్ కిచెన్ రాత్రికి రాత్రే ప్రజాదరణ పొందింది. ఈ రోజు వరకు ఆమె వీడియోకు 25,277,609 వీక్షణలు ఉన్నారు. ఒక వినియోగదారుని కామెంట్ ఇలా ఉంది 'నా 9 ఏండ్ల చిన్నారి స్వయంగా తయారు చేసింది. సుందరమైన వంటకం. ఇది రుచికరమైనదిగా మారింది. మీకు నా ధన్యవాదాలు''. ''ఈ రకమైన ఫీడ్‌బ్యాక్, వీక్షకులతో నిరంతర పరస్పర చర్య నాకు గొప్ప సంతప్తిని, ఆనందాన్ని ఇస్తుంది'' అని కబితా చెప్పారు.
ట్రోలింగ్స్ కూడా ఉన్నాయి
అయితే ఇది అన్ని వేళలా ప్రశంసలు పొందదు. ట్రోలింగ్ సమస్యలను కూడా ఆమె ఎదుర్కొంది. ''ఎవరో ఒకసారి నా వీడియో గురించి దుర్భాషలాడారు. దాని గురించి చాలా బాధపడ్డాను. కానీ నా భర్త మనీష్ ఈ వ్యాఖ్యలను ఎదుర్కోకుండా పారిపోవద్దని, నా వైపు నుండి ఏవైనా తప్పులు ఉంటే స్పష్టం చేయమని నాకు నేర్పించారు. కోల్‌కతాలో మేము చిన్నప్పుడు తినే చేపల కూరకు సబంధించి నేను మా అమ్మ వెర్షన్‌ను తయారు చేసాను. దానికి బెంగాలీ ఫిష్ కర్రీ అని పేరు పెట్టాను. ఇది బెంగాలీ ఫిష్ కర్రీ లాంటిది కాదని చాలా ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి. కామెంట్లు చేసిన వారిని ఉద్దేశించి నేను తప్పుగా టైటిల్ పెట్టడం వల్ల ఆ లోపం నా వైపుకు వచ్చిందని వారికి చెప్పాను. ఆ తర్వాత ప్రేక్షకులు నా నిజాయితీని మెచ్చుకోవడం మొదలుపెట్టారు'' అని కబిత వివరించింది. ఈ విధంగా మహిళలు పని-జీవిత సమతుల్యతపై నియంత్రణ సాధించడంలో సహాయపడటమే కాకుండా డిజిటల్ మీడియా వారు ఊహించని బలాలు, నైపుణ్యాలను కనుగొనడంలో మహిళలకు సహాయపడింది.
అడవులపై ఉన్న ప్రేమతో గార్డెన్ అప్
ముంబైకి చెందిన ఏక్తా చౌదరి గార్డెన్ అప్ను ప్రారంభించింది. గార్డెనింగ్‌కు అంకితమైన ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సృష్టించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎకాలజీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు ఏక్తా తన చిన్న హాస్టల్ గదిలో మొక్కల కటింగ్లను సేకరించి వాటిని పెంచడం ప్రారంభించింది. ''ఏనుగులు, పెద్ద శాకాహారులపై నా పరిశోధన కోసం నేను ముదుమలై అడవుల్లో గణనీయమైన సమయం గడపవలసి వచ్చింది. కానీ పీహెచ్‌డీకి చాలా డేటా విశ్లేషణ అవసరం. కాబట్టి నాకు అది బోరింగ్‌గా అనిపించింది. ఆ సమయంలో నేను అడవిలో ఉండటాన్ని ఇష్టపడ్డాను. బెంగళూరుకు తిరిగి వచ్చినప్పుడల్లా అడవుల్లో గడిపే నా సమయాన్ని కోల్పోయేదాన్ని. దాని నుండి బయటపడటానికి నేను మొక్కలను సేకరించడం ప్రారంభించాను'' అని ఏక్తా చెప్పారు.
యూట్యూబ్ ఛానల్ పొడిగింపుగా
ఏక్తా తన రీసెర్చ్ డిగ్రీ పూర్తి చేయకముందే తన చిన్న అభిరుచి పూర్తి స్థాయి యూట్యూబ్ ఛానెల్‌గా మారింది. ''నేను 2017లో గార్డెన్ అప్ ఛానెల్‌ని ప్రారంభించాను. 2019 నాటికి గార్డెనింగ్ గురించి నాకు సముచితమైన ఆలోచన వచ్చింది. నా ఛానెల్ ద్వారా వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించానని, నా ప్రేక్షకులను కలిగి ఉన్నానని నాకు తెలుసు. కాబట్టి అదే సంవత్సరం యూట్యూబ్ ఛానెల్ పొడిగింపుగా గార్డెన్ అప్ ఆన్లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాను. ఇది సిరామిక్ కుండీలు, ఎరువులు వంటి తోటపని ఉత్పత్తులను విక్రయించే దుకాణం. అయితే ఇందులో నేను నమ్మిన, ఆమోదించిన వాటిని మాత్రమే విక్రయిస్తాను.
గణనీయమైన కార్పొరేట్ ఖాతాదారులు
2020లో కోవిడ్-19 దెబ్బకు ఉద్యోగులు సుదూరంలో ఉండే తమ సొంత ప్రాంతాల నుండి పని చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో చాలా మంది హెచ్ఆర్ టీమ్‌లు ఉద్యోగుల ప్రేరణను పెంపొందించడానికి కార్పొరేట్ వర్క్‌షాప్‌లకు వెళ్లాయి. ఏక్తా ప్రేక్షకులు గణనీయమైన కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉంది. ఆమె తోటపనిపై డిజిటల్ వర్క్‌షాప్‌లతో మరొక ఎడ్యుటైన్మెంట్ను ప్రారంభించింది. కబితా, మలార్, ఏక్తాల అసలు కలలు విఫలమైనప్పటికీ అసమానతలను అధిగమించడం సాధ్యమేనని చూపించారు. దానికి కావలసిందల్లా కొంత తెలివి, చిత్తశుద్ధి.