Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెండకాయ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. దీంతో గుండె బాగా పని చేస్తుంది. బెండకాయలో ముసిలేజ్ అనే మందపాటి జెల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లెక్టిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 63శాతం వరకు నిరోధిస్తుంది.
- వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉండి మంచి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
- బెండలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది సెల్యులార్ జీవక్రియ ఫలితంగా ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది. కంటిశుక్లం రాకుండా చేస్తుంది.
- బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన జీర్ణక్రియకు, కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
- బెండకాయలో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది మృత చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.