Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగానికి వెళ్ళే ప్రతి వ్యక్తి పనికి సంబంధించిన ఒత్తిడి వారి జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుభవించి ఉంటారు. ముఖ్యంగా మనం యంత్రంలా కదులుతున్న వేగవంతమైన జీవితంలో ఇవన్నీ ఎవరికీ తెలియకుండా పోతున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అన్నింటికంటే ముందు ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. గెలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పాటిస్తున్నారు. ఫలితంగా హోంవర్క్, ఆఫీసు పనిని కలిసి లాగవలసి వస్తుంది. తలపెట్టిన పని పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నా ప్రతి పనిలోనూ ఒత్తిడిని కలిగించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. పనిభారం వల్ల కలిగే ఒత్తిడిని మనం అధిగమించలేము. ఇది సాధారణంగా జలుబుతో మొదలై గుండె జబ్బులు, ఇతర జీవిత సమస్యలకు కారణమవుతుంది. పని ఒత్తిడి సర్వసాధారణంగా మారిన వాతావరణంలో తక్కువ ఒత్తిడితో ఉద్యోగం కోసం వెతకడం నేటి ప్రపంచంలో అసాధ్యం. ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి లక్ష్యం, గడువు వంటి షరతులు ఉంటాయి. అన్నింటికీ పరిష్కారం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికోసం పని వదిలేసి ఇంట్లో కూర్చోలేము. కాబట్టి కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
సరైన ఆహారం, నిద్ర: తక్కువ చక్కెర, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోండి. ఎందుకంటే చెడు ఆహారపు అలవాట్లు మన ఒత్తిడిని పెంచుతాయి. తగినంత నిద్ర ఉంటే శరీరం పని గంటలలో అలసిపోదు. బాగా నిద్రపోయినప్పుడు శరీరం రోజంతా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది.
ప్లాన్ చేయండి: ఇంట్లో వ్యక్తిగత జీవితం, ఆఫీసు పని మధ్య స్పష్టమైన బార్డర్ను నిర్వచించండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ వంటి వాటిలో మునిగిపోకూడదు.
జాబితా చేయండి: అన్ని గడువులు, సవాలు చేసే పనులు, వ్యక్తిగత లక్ష్యాలలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవడం మీ ఇష్టం. సంగీతాన్ని వినండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సంగీతం వినడం సరైన పరిష్కారమని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. పనికి ముందు, పని తర్వాత, పని మధ్యలో అన్ని రకాల ఒత్తిడిని వదిలించుకోవడానికి ఇది సరైన మార్గం.