Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి తలకు పెట్టడం ఎప్పటి నుండో మనకు అలవాటే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు కురులను బలంగా, ఒత్తుగా చేస్తాయి. దీనికితోడు ఇంకొన్నింటిని చేరిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..
- ఉల్లిగడ్డ నుంచి రసం తీసి పక్కనపెట్టాలి. గుప్పెడు కరివేపాకును మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి ఉల్లిరసం కలిపి, మాడుకు పట్టించండి. గంట తర్వాత షాంపూ చేస్తే సరి. తల నెరవడం, వెంట్రుకలు రాలడం వంటివి తగ్గుతాయి.
- మెంతాకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకుని మెత్తగా రుబ్బాలి. దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి, అరగంటపాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. జుట్టు పెరుగుదలకే కాదు.. కుదుళ్ల నుంచి దృఢంగా తయారవడానికి సాయపడుతుంది.
- కప్పు కరివేపాకును మిక్సీ పట్టి, తగినంత పెరుగు కలిపాలి. దీన్ని తల, కురులకు పట్టించండి. 30-40 నిమిషాల తర్వాత కడిగేయండి. కురులు ఆరోగ్యంగా తయారవడంతోపాటు చుండ్రూ అదుపులోకి వస్తుంది.