Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయాన్నే ఉరుకులు పరుగులు మనకు మామూలే. దీనికి ఉద్యోగమూ తోడైతే... సమయంతో పోటీపడుతూ మీటింగ్‌లు, టార్గెట్లు.. సకాలంలో పూర్తిచేయడానికి కుర్చీలోంచి లేవరు కొందరు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఒక్కోసారి సమయాన్ని మించి అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తుంటారు. ఇలాగే కొనసాగితే ఒత్తిడి తప్పదు అంటున్నారు నిపుణులు.
- ఒత్తిడి వల్ల హార్మోనుల అసమతౌల్యత, నిద్రలేమి, బరువు పెరగడం మొదలవుతాయి. అందేరూ ఏమాత్రం సమయం దొరికినా రెండు మూడు నిమిషాలు కండ్లు మూసుకుని, ఊపిరి పీల్చి వదలడం సాధన చేస్తుండండి.
ఆకలికి ఏదో ఒకటి తినేయడం, జంక్ ఫుడ్ వైపు ఆకర్షితమవడం ఒత్తిడి సూచనలే. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోగా బరువు పెరుగుతారు. అందుకే పల్లీలు, వేయించిన శనగలు, పండ్లు వంటివి రోజూ వెంట తీసుకెళ్లండి. శరీరానికి తోడ్పడే ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ వంటివి అందుతాయి.
- సమయానికి అల్పాహారం తప్పక తీసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దు. ఇంకా దానిలో ఫైబర్, ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్, టొమాటో జ్యూస్లనూ భాగం చేసుకుంటే కావాల్సిన పోషకాలు అందుతాయి.
- సాధ్యమైనంత వరకూ తాజా ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. బయటి ఆహారం పరిశుభ్రమైనది కాకపోవచ్చు. పదే పదే వాడిన నూనెల్ని ఉపయోగిస్తుండొచ్చు. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా అధిక బరువు, కొన్నిసార్లు భావోద్వేగాల్లో మార్పులకూ కారణమవుతాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండటం మేలు. తగినంత నీటిని తాగాలి. ఇంకా రోజుకో 20 నిమిషాలు బ్రిస్క్‌వాక్ వంటివి చేస్తే.. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది.