Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్ట వద్ద కొవ్వు పేరుకునిపోయి పొట్టలావుగా వుండి చాలా ఇబ్బంది పడుతుంటారు కొందరు. వ్యాయామం చేయకపోవడం, పొద్దస్తమానం కూర్చుని పనిచేయడం వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది. ఒక్కసారి పేరుకున్నదంటే దాన్ని వదిలించుకోవడం కష్టమైన పనే. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని వ్యాయామం చేస్తుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే అవకాశం వుంది. ఈ కింది వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం వుంటుందంటున్నారు.
క్యారెట్లు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. ఇవి కేలరీలను బర్న్ చేస్తాయి. జీవక్రియను మెరుగుపరిచి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. కాబట్టి బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే క్యారెట్ తింటే కచ్చితంగా ఫలితం వుంటుంది.
బ్రోకలీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, క్రోమియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలోని కొవ్వుల జీవక్రియ విటమిన్ సి ద్వారా సక్రియం చేయబడుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.
బచ్చలికూరను సలాడ్‌గా ఉపయోగిస్తే, అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బచ్చలికూర తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
ఎర్ర మిర్చి రుచికరమైన వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో సోడియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, షుగర్, ప్రొటీన్, విటమిన్-సి వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఈ కారం తింటే పొట్ట తగ్గుతుంది.