Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త సంస్థలు వస్తున్నాయి. ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ కలల్ని నిజం చేసుకుంటున్నవారెందరో. అందులో మహిళలూ ముందున్నారు. మీరూ అటువైపుగా వేయాలనుకుంటే...
- సహ వ్యవస్థాపకులు, సలహాదారులు, మార్గనిర్దేశకులు... వీరి ఎంపిక విషయంలో స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత ఉండటం, లేకపోవడమనేది పని విధానంలో, కంపెనీ ఎదుగుదలలో చాలా తేడా చూపిస్తుంది.
- వినియోగదారుల అవసరం, సమస్య ఏంటి? దాన్ని మీరు ఏ విధంగా మెరుగ్గా పరిష్కరించగలరో అవగాహన అవసరం.
- మార్కెట్లో ఉన్న అవకాశాలు, అనుభవం, విషయ పరిజ్ఞానం ఉండాలి. మార్కెట్లో ట్రెండ్‌కు తగ్గ ఉత్పత్తి తెస్తున్నారేమో తెలుసుకోవాలి.
- పోటీని అధిగమించడానికి మీ స్వల్పకాల, దీర్ఘకాల వ్యూహాలుండాలి. వ్యాపారం ప్రారంభం వెనక మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? విలువలు, అంతిమ లక్ష్యం.. ఇవన్నీ రాసుకోవాలి.
- ఆఫ్‌లైన్, ఆన్లైన్ వీటిలో ఏ విధంగా మీ సేవలు అందుతాయి. హైబ్రిడ్ విధానంలో సేవలు అందించడానికి అవకాశాల గురించి ఆలోచించాలి.