Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బీజేపీ జెండాను చూసి మోస‌పోవద్దు : కేసీఆర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా

Sun 26 Jun 00:11:38.153528 2022

           వయసు పధ్నాలుగు. 54 టోర్నమెంట్లలో పాల్గొన్నది. ఎన్నో పతకాలు సాధించింది. నాలుగు దేశాల్లో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొంది. ఇటీవలె నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుని అందరి దృష్టిలో పడింది. ఆమే కురునెల్లి సలోమి. తనేదో ధనిక కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనుకుంటే పొరపాటే. తండ్రి పెయింట్‌ వర్క్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పైగా వికలాంగుడు. కేవలం కూతురి ఇష్టాని కాదనలేక కష్టపడి కరాటే శిక్షణ ఇప్పిస్తూ టోర్నమెంట్లకు తీసుకుపోతున్నాడు. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సహకరిస్తే మరెన్నో పతకాలు గెలుచుకుంటానని, కరాటేలో మన రాష్ట్రం పేరును ప్రపంచస్థాయిలో నిలబడతానని అంటుంది ఆమెతో మానవి సంభాషణ.
           సలోమి సొంత ఊరు ఖమ్మం. తండ్రి కె.వెంకట్‌, పెయింట్‌ వర్క్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలాగే వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. తల్లి కె.విజయ, గృహిణి. సలోమికి చెల్లి షారన్‌ వుంది. సలోమి పుట్టింది, పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. తన నాలుగేండ్ల వయసు నుండి కరాటే నేర్చుకుంటుంది. తను చదువుకుంటున్న పాఠశాల సెయింట్‌ థెరీస్సాలో కూడా ఎల్‌కేజీ నుండే కరాటే క్లాస్‌ ఉండేది. అలా పాఠశాలలో కూడా ఆమెకు కరాటే నేర్చుకునే అవకాశం దొరికింది. అయితే కొంత కాలం తర్వాత మాస్టర్లు దొరకకపోవడం, పిల్లల తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాఠశాలలో కరాటే క్లాసులు ఆపేశారు. అప్పుడు సలోమి రెండో తరగతిలో ఉంది.
బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది
           పాఠశాలలో కరాటే శిక్షణ ఆపేసినా సలోమి మాత్రం పట్టుబట్టి మరీ స్కూల్లో నేర్పించిన మాష్టర్‌ వద్దకే రెండో వెళ్ళి శిక్షణ కొనసాగించింది. అలా మొదటి సారి తను మూడో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్‌ స్థాయిలో విజరు భాస్కర్‌ రెడ్డి స్టేడియలో జరిగిన పోటీలో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించింది. అప్పటి నుండి కరాటే అంటే మరింత ఇష్టం పెరిగింది. పదేండ్ల వయసులో మలేషియా వెళ్ళింది. తర్వాత బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొని బహుమతి గెలుచుకుంది. 2020లో బ్లాక్‌ బెల్డ్‌ పూర్తి చేసింది.
ఒలింపిక్స్‌లో పాల్గొనాలి
           ''నాకు ఒలింపిక్స్‌లో ఆడాలని వుంది. అయితే అది ఆడాలంటే 18 ఏండ్లు నిండి ఉండాలి. ఈ లోపు ఏషియన్‌, కామన్‌వెల్త్‌ టోర్నమెంట్లలో పాల్గొంటాను. వీటికి 15 ఏండ్లు దాటితో పాల్గొనవచ్చే. అయితే నా గోల్‌ మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొనడమే'' అంటుంది సలోమి. బ్లాక్‌ బెల్డ్‌ పూర్తి చేసిన సలోమి ప్రస్తుతం తన సొంతంగానే ప్రాక్టీస్‌ చేసుకుంటుంది. ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రాక్టిస్‌ చేస్తుంది. అందులో కథాస్‌, వెపన్స్‌, స్పెయిరింగ్‌, ఫైటింగ్స్‌ అనే శిక్షణ ఉంటుంది. టోర్నమెంట్లు ఉన్నప్పుడు మాత్రం మాస్టర్‌ వచ్చి ప్రాక్టిస్‌ చేయిస్తారు. కరాటేలో ఇంత ప్రతిభను కనబరుస్తున్న సలోమి డ్రాయింగ్‌ కూడా ఎంతో అందంగా వేస్తుంది.
ప్రభుత్వం నుండి సహకారం లేదు
           అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొని రావాలంటే కనీసం రెండు లక్షలు ఖర్చు అవుతుంది. ఆర్థిక పరిస్థితులతో కూతురికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నానని సలోమి తండ్రి బాధపడుతున్నారు. మొదటి సారి మలేషియా వెళ్ళినపుడు ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు ఆర్థిక సహకారం పొందగలిగారు. అప్పటి నుండి మళ్ళీ ప్రభుత్వం నుండి సలోమీకి ఎలాంటి సహకారం అందడం లేదు.
ఆర్థిక సమస్యలతో వెళ్ళలేకపోతుంది
           ఇప్పటి వరకు సలోమి 54 టోర్నమెంట్స్‌లో పాల్గొంది. నేపాల్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. మలేషియాలో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. థాయిలాండ్‌లో రెండు సార్లు పాల్గొంటే ఒకసారి గోల్డ్‌, ఒకసారి బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. వెళ్ళిన ప్రతి సారి డబ్బులు కూడా చాలా ఖర్చు అయ్యాయి. అయినప్పటికీ కూతురు నేర్చుకోవాలనే నమ్మకంతో ఉంది. అందుకే కష్టపడి అప్పులు చేసి మరీ ఆ తండ్రి బిడ్డను టోర్నమెంట్లకు తీసుకుపోతున్నారు. ఇంకా ఎన్నో టోర్నమెంట్లకు రమ్మంటూ అవకాశాలు వస్తున్నాయి. కానీ కేవలం ఆర్థిక సమస్యల వల్ల వెళ్లలేకపోతుంది.
థాయిలాండ్‌లో గంటసేపు రన్నింగ్‌
           థాయిలాండ్‌ ఒకసారి 35 కేజీల విభాగం నుండి సలోమి పాల్గొనేందుకు వెళ్ళింది. అయితే అక్కడ ఆమె 350 గ్రాముల బరువు ఎక్కువ వుందని రిజెక్ట్‌ చేశారు. దాంతో గంట సేపు రన్నింగ్‌ చేసి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అలాగే అప్పుడు తను వేసుకున్న టీ షర్ట్‌ కూడా బరువు ఎక్కువ వుందని గమనించి మొత్తానికి ఎలాగో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ సమస్య నుండి ఎలాగో బయటపడిందనుకుంటే మరో సమస్య వచ్చి పడింది. టోర్నమెంట్‌లో పాల్గొనే వారు కచ్చితంగా టీత్‌ గార్డ్‌ పెట్టుకోవాలి. తను ఎప్పుడూ వాడేది ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. అది లేకపోతే పోటీల్లో పాల్గొననివ్వరు. దాంతో అప్పటికప్పుడు అక్కడ కొత్తది కొనుక్కుంది. అయితే అది కొద్దిసేపు వేడి నీళ్ళలో వేసి ఉపయోగించాలి. అప్పుడే పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే అంత సమయం లేకపోవడంతో అలాగే పెట్టేసుకుంది. దాంతో అవి గుచ్చుకుని రక్తం వచ్చింది. ఆ ఇబ్బందితో సరిగా ఆడలేకపోయింది. అయినా మూడో స్థానంలో నిలిచింది. కరాటే అంటే ఆమెకు ఉన్న ఇష్టానికి ఇదొక ఉదాహరణ. 2018లో థాయిలాండ్‌లో జరిగినపుడు ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. అదే సంవత్సరం మలేషియా టెర్న మెంట్‌లో కూడా పాల్గొంది. 2019లో మళ్ళీ థాయి లాండ్‌ లోనే జరిగాయి. అయితే పైన సమస్యల వల్ల మూడో ప్లేస్‌ సాధించింది. ఆ తర్వాత కరోనా వల్ల పోటీలు జరగలేదు.
దుబాయ్‌ వెళ్ళలేదు
           వాస్తవానికి సలోమి ఈ నెలలో దుబారులో జరిగిన టోర్నమెంట్‌కు వెళ్ళాల్సి వుంది. ఒకరు స్పాన్సర్‌ చేస్తామని ముందు మాట కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో వాళ్ళు తమ స్పాన్సర్‌ఫిప్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. దాంతో దుబాయ్‌ జరిగే టోర్నమెంట్‌కు వెళ్ళలేకపోయింది. దాంతో ఆమె చాలా బాధపడింది. కానీ కుంగిపోలేదు. జూలై 23 నుండి థాయిలాండ్‌లో జరగబోయే టోర్నమెంట్‌లో ఎలాగైనా పాల్గొనాలని కోరుకుంటుంది. దానికోసం అవసరమైన ఆర్థిక సహకారం కోసం తండ్రి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరైనా స్పాన్సర్‌ వస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం సహకరించాలి
           క్రీడలంటే అందరి దృష్టిలో క్రికెట్‌, టెన్నిస్‌ లేదా బాక్సింగ్‌ మాత్రమే. కానీ యువత తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. అవేవీ పెద్దగా గుర్తింపు పొందలేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఆదరణ పొందడం లేదు. ఆడపిల్లలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. వాటి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆత్మరక్షణ అమ్మాయిలకు చాలా అవసరం. కరాటే శిక్షణ తీసుకుంటే కొద్దిగైనా ఆడపిల్లలకు ధైర్యం ఉంటుంది. అలాంటి క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన రాష్ట్రంలో క్రీడల పట్ల మరింతగా ప్రోత్సాహం పెరగాలి. చిన్నతనం నుండే నేర్చుకునే పిల్లలను గుర్తించి వాళ్ళకు కావల్సిన సహకారం అందించాలి. మా అమ్మాయి నాలుగేండ్ల వయసులో కరాటే నేర్చుకుంటానని తనంతట తనే అడిగింది. ఇప్పటికి పధ్నాలుగేండ్ల నుండి నేర్చుకుంటుంది. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఎన్నో మెడల్స్‌ సాధించింది. అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్ళాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది అవుతుంది. థాయిలాండ్‌, మలేషియా, బ్యాంకాక్‌, టర్కీ, హాంకాంగ్‌, చైనా వంటి దేశాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడి వరకు వెళ్ళాలంటే సబ్‌ జూనియర్స్‌కు చాలా ఇబ్బంది అవుతుంది. మా అమ్మాయి చాలా కష్టపడుతుంది. ఇలాంటి అమ్మాయిలు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వారిని గుర్తించాలి. అవసరమైన సహకారం అందించాలి. మహిళలు గౌరవప్రదంగా ఈ సమాజంలో జీవించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కరాటే చాలా అసవరం. ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం సలోమి భవిష్యత్‌లో ట్రైనింగ్‌ ఇవ్వాలని కోరుకుంటుంది.
- కె. వెంకట్‌, సలోమి తండ్రి

దెబ్బలు తగులుతాయని భయం
         అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు మోటివేట్‌ చేయాలి. అబ్బాయిలు ఎక్కువమంది నేర్చుకుంటున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం నేర్చుకోవడం లేదు. ఆడపిల్లలకు దెబ్బలకు తగిలితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురౌతాయని భయంతో చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు నేర్పించాడానికి ముందుకు రావడంలేదు. అయితే మానాన్న మాత్రం నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. నా శిక్షణకు ఎలాంటి ఆటకం లేకుండా చూసుకుంటున్నాడు. 2020లో నా బ్లాక్‌ బెల్డ్‌ పూర్తి చేశాను. మా మాస్టారు కంతె సత్య శంకర్‌. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తుంటారు.
అమ్మాయిలకు ట్రైనింగ్‌ ఇస్తా
         చిన్నప్పటి నుండి నాకు డిఫరెంట్‌గా ఉండే ఆటలంటే ఇష్టం. ట్రిక్స్‌తో ఆడే ఆటలు కరాటే, ఖోఖో వంటివి బాగా ఆడేదాన్ని. అలా కరాటే అంటే కూడా ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు ఏదో ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నాను. అయితే తర్వాతర్వాత తెలిసింది దీని వల్ల మనల్ని మనం డిఫెన్స్‌ చేసుకోవచ్చని. బయట చాలా దాడులు జరుగుతున్నాయి. కరాటే నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అందుకే నేను కూడా పదో తరగతి అయిపోయిన తర్వాత నాలాంటి అమ్మాయిలకు కరాటేలో ట్రైనింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను.

- సలీమ

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎందరో తల్లుల త్యాగ ఫలితం
సాంప్రదాయ సంకెళ్ళను తెంచుకొని మాతృదేశం కోసం ఉద్యమించి
ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి
ఇట్ల చేద్దాం
దేశం కోసం ఇల్లు వదిలింది
ఎగిసిపడ్డ మహిళా కెరటం
సాహస మహిళల పోరాటం
ఆపదలో అండే నిజమైన స్నేహం
ఏదీ ఆమెను ఆపలేదు
ఇట్ల చేద్దాం
ఈ మార్పులు సాధారణమే
త్వరగా యుక్తవయసుకు వస్తున్నారా..?
హస్తకళాకారులను బలోపేతం చేయడమే సదాఫ్‌ లక్ష్యం
మహిళల జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది
అమ్మ కోసం
రుచికి, ఆరోగ్యానికి కిచిడీ
ఆటంకాలు రాకుండా...
కోరుకున్నది దొరక్కపోతే
కాఫీ తాగితే తలనొప్పి
ఇట్ల చేద్దాం
మాకు ప్రత్యేక దుస్తులు అవసరం
కలుపు మొక్కల నుండి అద్భుతాలు
టెన్షన్‌ పడుతున్నారా..?
ఇట్ల చేద్దాం
నిరుపేద పిల్లల క్రీడా సాధికారతకై
కండ్లు జాగ్రత్త
ఇట్ల చేద్దాం
బరువు పెరగాలంటే..?
కల్పనా చావ్లాని అనుసరించాను
ధౌలగిరిని అధిరోహిస్తాను
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.