Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ప్రయాణం మనసును ఉత్తేజపరుస్తుంది.. ఓ ప్రయాణం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎప్పుడూ కుటుంబం, బాధత్యల నడుమ కురుకుపోయే మహిళలకు సరదాగా అలా ప్రయాణించాలని ఉంటుంది. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయి బాధ్యతలు తగ్గిన తర్వాత ఆ కోరిక మరీ ఎక్కువ అవుతుంది. అది ఒంటరిగా కావొచ్చు. స్నేహబృందంతో కావొచ్చు. కానీ అమ్మో ఒంటరిగా ప్రయాణం చేయడమా అనే భయం వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వారికి థైర్యం ఇచ్చి, హాయిగా ప్రయాణించే సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు మహిళలే ప్రత్యేకంగా ట్రాలెవ్ కంపెనీలు నడుపుతున్నారు. ఆ వివరాలు ఏంటో మనమూ తెలుసుకుందాం...
కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో ఇటీవల కాలంలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు వేగాన్ని పుంజుకున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సోలో ట్రావెల్ కూడా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున దూసుకుపోయింది. మీ రోజువారీ ఒత్తిడి నుండి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారా అని మహిళలను అడిగితే అవును అనే సమాధానం కచ్చితంగా వస్తుంది.
ఒంటరిగా లేదా సమూహమైనా
ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ ట్రావెల్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని గ్రహించారు. ముఖ్యంగా మహిళల ఒంటరి ప్రయాణాలకు సహాయం చేయడానికి సొంత ట్రావెల్ కంపెనీలను ప్రారంభించారు. మీ ట్రిప్‌ను, ఒంటరిగా లేదా ఇతర మహిళా సమూహాలతో కలపడం, మీ భద్రతపై శ్రద్ధ వహించడంతో పాటు ప్రయాణంలో అదనపు సామాను మోసే భారం లేకుండా చేయడం లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.
వావ్ క్లబ్ - ఉమెన్ ఇన్ వాండర్లస్ట్
రచయిత్రి, ప్రయాణాల పట్ల అవగాహన, ఆసక్తి ఉన్న సుమిత్రా సేనాపతి 2005లో వావ్ క్లబ్‌ను ప్రారంభించారు. ఇది మహిళల కోసం ఏర్పాటయిన ఆన్ వాండర్లస్ట్ అని అర్థం. సమూహం ప్రయాణంలో అందించే భద్రతతో పాటు మహిళలు ఒంటరిగా ప్రయాణించేలా ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. వావ్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి ట్రిప్ జూన్ 2005లో లడఖ్‌కు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2006లో దాని మొదటి విదేశీ ప్రయాణం ఈజిప్ట్‌కి పర్యటించింది. ఆ కంపెనీ ఇప్పుడు సంవత్సరానికి 125 ట్రిప్పులకు పైగా నడుపుతుంది. దేశంలో దీని ప్రయాణాలు కాశ్మీర్ నుండి కేరళ వరకు విస్తరించాయి. అంతర్జాతీయ పర్యటనల విషయానికి వస్తే అంటార్కిటికా, బాలి, ఎస్టోనియా, గ్రీస్‌తో పాటు ఎన్నో ఉత్తేజపూరితమైన దేశాలు ఉన్నాయి. ఈ గ్రూప్ కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. 70 ఏండ్లు పైబడిన మహిళా ప్రయాణికులను కూడా స్వాగతిస్తుంది. అయితే వారితో పాటు కుటుంబ సభ్యుడు లేదా స్నేహితురాలు ఉండాలి. గత 17 సంవత్సరాలలో వావ్ క్లబ్ 10,000 మంది మహిళా ప్రయాణికులను ప్రపంచవ్యాప్తంగా 90 ప్రదేశాలు పర్యటించేలా ప్రోత్సహించింది.
గర్ల్స్ ఆన్ ది గో (జీఓటీజీ)
2007లో గొప్పపేరుతన్న న్యాయవాది పియా బోస్ హిమాలయాల పర్యటన కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఈ అనుభవం ఆమెలో మరో ఆలోచనను రేకెత్తించేలా చేసింది. సంవత్సరం తర్వాత సమూహ ప్రయాణికుల భద్రతతో పాటు ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం పియా ఒక ట్రావెల్ కంపెనీని ఏర్పాటు చేసింది. కంపెనీ ముఖ్యంగా అనుభవాలపై దష్టి పెడుతుంది. దాని ప్రయాణికులు అంటార్కిటికాలో క్రూజింగ్, నార్వేలో నార్తర్న్ లైట్స్ చూడటం, మంగోలియాలో సంచార జీవనం వంటి యాత్రలను ఆస్వాదించారు. భారతదేశంలో 15 మంది యువ వ్యాపారవేత్తలతో కలిసి పియాను కాండే నాస్ట్ ఇండియా ప్రదర్శించింది. జీరో-క్యాష్ స్టార్టప్‌ను ప్రారంభించడంపై TEDxలో మాట్లాడింది.
లడఖీ ఉమెన్స్ ట్రావెల్ కంపెనీ
థిన్లాస్ చోరోల్ 2009లో లడఖీ ఉమెన్స్ ట్రావెల్ కంపెనీ (LWTC)ని స్థాపించారు. ట్రెక్కింగ్ పరిశ్రమలో మహిళలకు చాలా తక్కువ అవకాశం ఉండటమే థిన్లాస్నిLWTC ప్రేరేపించేలా చేసిన కీలక అంశం. మగ గైడ్లతో సాధారణంగా అసౌకర్యంగా ఉండే ఒంటరి మహిళా ట్రెక్కర్లకు సహాయం చేయడం చాలా అవసరమని థిన్లాస్ గ్రహించారు. ఈ సంస్థ షామ్ ప్రాంతం, హేమిస్ నేషనల్ పార్క్ చుట్టూ ట్రెక్కర్లను తీసుకువెళుతుంది, ట్రెక్కింగ్ ప్యాకేజీలు 2-14 రోజుల మధ్య ఉంటాయి సులభమైన, మితమైన, కష్టతరమైన అధిరోహణలతో ఉంటాయి. LWTC కూడా ఇతర దేశాల నుండి అతిథులను మారుమూల గ్రామాలకు తీసుకువెళుతుంది. ఇక్కడ స్థానిక మహిళలు కొత్త సంస్కతులను తెలుసుకోవడంతో పాటు ఆ మహిళలకు గైడ్‌గా ఉంటూ కొంత డబ్బు సంపాదించవచ్చు.
వోవాయేజ్
రష్మీ చద్దా 2016లో వోవాయేజ్ని స్థాపించినప్పుడు ఒంటరి మహిళా ప్రయాణీకులకు గర్ల్ గైడ్లను అందించడం తన కర్తవ్యంగా పెట్టుకుంది. మహిళలకు అనుకూలమైన వసతి, రవాణా, సమూహతో కలిసి ప్రయాణించడం, గైడెడ్ లేదా ప్రైవేట్ టూర్ల వరకు ప్రతిదీ నిర్వహిస్తుంది. మహమ్మారి నుండి వోవాయేజ్ స్టేకేషన్ల కోసం డిమాండ్‌ను పెంచింది. దీనికోసం రష్మీ వసతి సేవల నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభించింది. అనేక చిన్న వ్యాపారాలు, హౌమ్స్టేలు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తులను ఉచితంగా ఉపయోగించుకునేలా, కమ్యూనిటీలను అభివద్ధి చేసి వాటిని డిజిటల్‌గా మార్చాలని భావిస్తోంది.
F5Escapes
మాలినీ గౌరీశంకర్, ఆకాంక్ష బంబ్ F5Escapes ను స్థాపించారు. వీరు భారతదేశంలో మహిళలు ప్రయాణించే విధానాన్ని పునర్నిర్వచించడంపై దష్టి సారించారు. ఒక అనుభవపూర్వకమైన ప్రయాణ సంస్థ F5Escapes. భారతదేశం అంతటా మహిళలు స్వేచ్ఛగా, భద్రతతో పర్యటించేలా చేస్తుంది. ఒంటరిగా ప్రయాణించే వారికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తుంది. సంస్థ పర్యటించే జాబితాలో భారతదేశంలోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలైన కర్ణాటకలోని ధర్మస్థల, హంపి, కేరళలోని వాయనాడ్, కులు, తీర్థన్ వ్యాలీతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ ఇంకా ఎన్నో ఉన్నాయి.