Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో పిల్లలు చేసే చిన్న పొరపాట్లకీ గరుమని అరుస్తారు కొందరు. కాసేపటి తర్వాత చిట్టి మనసుని అకారణంగా గాయపరిచానే అనుకుని బాధపడటమూ సహజమే. అలాంటప్పుడు పిల్లలకి క్షమాపణలు చెబితే ఇద్దరికీ ఊరట.
క్షమాపణలు చెప్పడం ద్వారా మీరూ పిల్లల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతుంది.
పొరపాటు చేసేముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తెలుస్తుంది.
క్షమాపణలు ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో నేర్చుకుంటారు.
పెద్దవాళ్లే క్షమాపణలు చెబితే, అది మీ వ్యక్తిత్వం అని వాళ్లకి అర్థమవుతుంది. దాని ద్వారా నేర్చుకుంటారు కూడా.
ఏదో మాట వరసకి 'సారీ' అనేయడం కాదు, మీ క్షమాపణలో నిజాయతీ ఉందని వాళ్లకి అర్థమవ్వాలి. 'నువ్విలా చేసుంటే నేనలా అనేదాన్ని కాదు' లాంటి షరతులతో కూడా క్షమాపణలు వద్దు. బేషరతుగా 'నేను కోప్పడి ఉండాల్సింది కాదు' అని చెప్పండి. అదే సమయంలో ప్రతిసారీ కోప్పడుతూ క్షమాపణలు చెప్పకుండా, అలాంటి పరిస్థితిలో కాసేపు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ మౌనం కూడా పిల్లలకి పెద్ద పాఠమే.