Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట కోసం మనం ఉపయోగించిన పాత్రలు, గిన్నెలు.. వంటివి సింక్లో పడేసి ఏ సాయంత్రమో లేదంటే మరునాడు ఉదయమో కడిగేసుకుంటాం. కానీ అలాంటి పాత్రల్లో ఉండే వ్యర్థాలు, జిడ్డుదనం, తేమ.. కారణంగా వాటి వాడకం పూర్తయిన రెండు గంటల తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి రెండు గంటల్లోపే వాటిని కడిగేసుకోవడం ఉత్తమం. ఇలా ఎప్పటికప్పుడు పాత్రల్ని శుభ్రం చేసుకోవడం వల్ల శ్రమా తగ్గుతుంది.. ఆరోగ్యంగానూ ఉండచ్చు. అలాగే ఈ పాత్రల్ని పూర్తిగా ఆరబెట్టడమూ ముఖ్యమే.